Bangalore: ఆన్‌లైన్‌లో 39.91 లక్షల మోసం.. అదెలా జరిగిందంటే..
ABN, Publish Date - Oct 18 , 2024 | 12:51 PM
ఆన్‌లైన్, సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం అయ్యే అపరిచిత వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండాలని జిల్లా సైబర్ పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ... ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నా... ప్రజలు మాత్రం అవేమి పట్టించుకోకుండా... డబ్బు ఆశతో లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్న ఘటనలు... నిత్యం వెలుగు చూస్తున్నాయి.
- గ్రామాలకు విస్తరిస్తున్న ఆన్‌లైన్ మోసాలు
- ఈజీ మనీ మోజులో నష్టపోతున్న ప్రజలు
- డబ్బు మీద ఆశతో రూ.40 లక్షల డిపాజిట్
బళ్లారి(బెంగళూరు): ఆన్‌లైన్, సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం అయ్యే అపరిచిత వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండాలని జిల్లా సైబర్ పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ... ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నా... ప్రజలు మాత్రం అవేమి పట్టించుకోకుండా... డబ్బు ఆశతో లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్న ఘటనలు... నిత్యం వెలుగు చూస్తున్నాయి. అయినా ప్రజల్లో మాత్రం అవగాహన కలగడం లేదని పోలీసు శాఖ అభిప్రాయ పడుతోంది. ఇంతవరకు ఆన్‌లైన్ మోసాలు... నగరాలు, పట్టణాలకే పరిమితం అయ్యేవి. ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలు గ్రామాలకు కూడా విస్తరించడంలో బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉంచుకోవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ వార్తను కూడా చదవండి: Assam: అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన బోగీలు
ఈ నేపథ్యంలో బళ్ళారి తాలూకా పరిధిలోని జాలిబెంచి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి షేర్ మార్కెట్‌లో లభించే లాభాలపై ఆశపడి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్న ఘటన వెలుగు చూసింది. జాలిబెంచి గ్రామానికి చెందిన ఆ వ్యక్తి ఈ నెల 15వ తేదీన బళ్ళారి నగరంలోని సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో చేసిన పిర్యాదును పరిశీలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. అతడు ఈ ఏడాది జూన్ 17వ తేదీన మొబైల్‌లో షేర్‌మార్కెట్ గురించి వెతుకుతున్న సమయంలో మోతిలాల్ ఓస్వాల్ పైనాన్స్ సర్వీసు గురించిన సమాచారం చూశాడు. అందులో ఉన్న ఫోన్ నెంబరును సంప్రదించి అక్కడి నుంచి వచ్చిన మెసేజ్‌లతో మోతీలాల్ ఓస్వాల్ పైనాన్స్ సర్వీసు పోర్ట్‌పోలియో వాట్సప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యాడు.
ఐపిఓఎ్‌సలో డిపాజిట్ చేస్తే 10శాతం లాభాలు వస్తాయని, ఆ గ్రూప్ నుంచి వాట్స్‌పలో మెసేజ్‌లు రావడంతో అందులో డబ్బు డిపాజిట్ చేయడం ప్రారంభించాడు. ఈ ఏడాది జులై 9వ తేదీ నుండి ఆగస్టు 6వ తేదీ వరకు దశల వారీగా రూ 39,91,837లక్షల మొత్తాన్ని తన తల్లి, తన ఖాతాల నుండి జమ చేశాడు. అనంతరం అక్కడి నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో భయపడి... ఆగస్టు 6వ తేదీన ఆన్‌లైన్ కంప్లైంట్ చేశాడు. తిరిగి ఈ నెల 15వ తేదీన బళ్ళారి నగరంలోని సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్.సి.ఆర్.పి నెం 1122/2024గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
................................................................
ఈ వార్తను కూడా చదవండి:
.................................................................
Gali Janardana Reddy: బీజేపీపై అసత్య ఆరోపణలు మానుకోవాలి.. లేకుంటే..
- మాజీ మంత్రి నాగేంద్రపై గాలి జనార్దనరెడ్డి నిప్పులు
బళ్లారి(బెంగళూరు): బీజేపీపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని హీరోయిజం చూపించవద్దని ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి(MLA Gali Janardhan Reddy) మాజీ మంత్రి నాగేంద్రకు సూచించారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనతో సహా గత యూపీఏ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్న అనిల్ లాడ్, ఆనంద్‌సింగ్, సురేశ్‌బాబు, నాగేంద్ర సతీశ్ శైల్ తదితరులు సీబీఐ అరెస్టు చేయడం కారణంగా జైలులో ఉన్న సంగతి మర్చిపోవద్ధన్నారు. మళ్ళీ మంత్రి కావాలనుకునే నేపథ్యంలో బీజేపీపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు.
వాల్మీకి కార్పోరేషన్ కుంభకోణలో విమాన టిక్కెట్లు, ఇంటి ఖర్చుల కోసం కార్పోరేషన్ డబ్బును వినియోగించినట్లు ఈడీ సమర్పించిన చార్జిషీట్‌లో పేర్కొందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు భరత్‌రెడ్డి, గణేశ్, కూడ్లిగి ఎమ్మెల్యే శ్రీనివాసులు రూ 1480కోట్లు కేటాయించారని, కార్యకర్తలకు ఒక్కొక్కరికి పదివేలు అందజేశారని, ఇదంతా ఈడీ రికార్డుల నుంచి తెలిసిందన్నారు. ఎన్నికల కోసం మొత్తం రూ. 20కోట్లు వినియోగించారన్నారు. వాల్మీకి, వక్ప్, సిద్దార్ధట్రస్ట్, ముడాతోపాటు గత 15 నెలల్లో కాంగ్రెస్ అనేక కుంభకోణాల్లో కూరుకుపోయిందన్నారు. ఇది బ్యాంకు స్కాం అని చెప్పడానికి సిగ్గుపడాలన్నారు.
సండూరు గెలుపే లక్ష్యం..
ఈసారి సండూరు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని, ఎన్నికల్లో చురుగ్గా పాల్గొంటామన్నారు. అందుకు సండూరులో ఇంటింటికి వెళుతామన్నారు. ఆదివారం నుంచి ప్రతి గ్రామానికి వెళ్లి, ప్రచారం చేస్తానన్నారు. ఈసందర్బంగా మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అనిల్‌నాయుడు, పంచాయతీ మాజీ సభ్యుడు గోనాల్‌రాజ శేఖర్‌గౌడ్, హెచ్ హనుమంతప్ప, డా. బీకే సుందర్ పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: BJP: కిషన్‌రెడ్డిపై అనుచిత వీడియోలు తొలగించాలి
ఇదికూడా చదవండి: Vijay Babu: కేసీఆర్ వల్లే చిన్న లిఫ్టులు నిర్వీర్యం
ఇదికూడా చదవండి: బీఆర్‌ఎస్ హయంలో నాసిరకం చీరలు ఇచ్చి.. మహిళల ఆత్మగౌరవాన్ని కించపర్చారు
ఇదికూడా చదవండి: బతుకమ్మ చీరల విషయంలో సీతక్క పొంతన లేని వ్యాఖ్యలు: హరీశ్
Read Latest Telangana News and National News
Updated Date - Oct 18 , 2024 | 12:51 PM