ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

NEET UG Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసులో 6 పోస్ట్ డేటెడ్ చెక్కులు స్వాధీనం..13 మంది అరెస్టు

ABN, Publish Date - Jun 17 , 2024 | 08:37 AM

నీట్ యూజీ పరీక్ష 2024కి(neet ug 2024 exam) సంబంధించిన వివాదం క్రమంగా ముదురుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో వివాదం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ విషయంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ కేసులో బీహార్ పోలీసులు ఆరు పోస్ట్ డేటెడ్ చెక్కులను స్వాధీనం చేసుకున్నారు.

neet ug paper Bihar Police recover 6 post dated checks

నీట్ యూజీ పరీక్ష 2024కి(neet ug 2024 exam) సంబంధించిన వివాదం క్రమంగా ముదురుతోంది. ఇప్పట్లో ఈ వివాదం తేలేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ విషయంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. మొదట ఈ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత బీహార్(Bihar) నుంచి పేపర్ లీక్(paper leak) వార్త వెలుగులోకి వచ్చింది. తర్వాత అనేక మందికి సేమ్ ర్యాంకులు వచ్చాయని తేలింది. తాజాగా ఈ కేసులో బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOU) ఆరు పోస్ట్ డేటెడ్ చెక్కులను స్వాధీనం చేసుకుంది.


ఇవి గత నెలలో జరిగిన నీట్ పరీక్షకు(neet exam) ముందు లీకైన ప్రశ్నపత్రాల కోసం జారీ చేశారని, ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30 లక్షలకు పైగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. విచారణలో అభ్యర్థులకు ప్రశ్నపత్రాలను అందించినట్లు ఆరోపించిన నేరస్తులకు అనుకూలంగా ఆ చెక్కులను జారీ చేసినట్లు ఈఓయూ(EOU) డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ మానవ్‌జీత్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ప్రస్తుతం సంబంధిత బ్యాంకుల నుంచి ఖాతాదారుల సమాచారాన్ని దర్యాప్తు అధికారులు సేకరిస్తున్నారని వెల్లడించారు. NEET-UG 2024 పేపర్ లీక్ కేసులో నలుగురు ఎగ్జామినీలు, వారి కుటుంబ సభ్యులతో సహా 13 మందిని ఇప్పటివరకు అరెస్టు చేసినట్లు ధిల్లాన్ వెల్లడించారు. నిందితులంతా బీహార్‌కు చెందినవారని చెప్పారు.


విచారణలో చేరాల్సిందిగా మరో తొమ్మిది మంది అభ్యర్థులకు కూడా ఈఓయూ(Economic Offences Unit) నోటీసులు జారీ చేసిందని ధిల్లాన్ తెలిపారు. ఇందులో బీహార్ నుంచి ఏడుగురు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరు ఉన్నారని అన్నారు. ఈ అభ్యర్థులను విచారించడం ద్వారా పేపర్ లీక్ సమస్య గురించి మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందన్నారు.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) 2024ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 571 నగరాల్లోని 4,750 కేంద్రాలలో 22 లక్షలకు పైగా అభ్యర్థుల కోసం నిర్వహించారు. NEET-UG 2024 ఫలితాలు జూన్ 4న ప్రకటించబడ్డాయి. NEET-UG పరీక్షను దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో MBBS, BDS, ఆయుష్ సహా ఇతర కోర్సులలో ప్రవేశానికి NTA నిర్వహిస్తుంది.


ఇది కూడా చదవండి:

Viral News: వామ్మో ఈ మేక ధర తెలిస్తే షాక్ అవుతారు..ఈ రేటుతో ఓ ఇల్లు కొనుక్కోవచ్చు


Rahul Gandhi: ఈవీఎంలపై అనుమానాలు.. ఎన్నికల ప్రక్రియలో లోపాలపై ప్రశ్నలు సంధించిన రాహుల్..


Elon Musk: ఈవీఎంల గురించి ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు..ఏమన్నారంటే


Read Latest Crime News and Telugu News

Updated Date - Jun 17 , 2024 | 08:40 AM

Advertising
Advertising