BJP leader: బీజేపీ నేత అరెస్ట్.. కారణం ఏంటంటే...
ABN, Publish Date - Jul 04 , 2024 | 01:08 PM
మహిళపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యవహారంలోఉత్తర చెన్నై బీజేపీ కార్యదర్శి సెంథిల్(Chennai BJP Secretary Senthil)ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక కొరుక్కుపేట నేతాజీ నగర్‌కు చెందిన రామరాజన్ భార్య నవమణి కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది.
- మహిళపై ఆత్మహత్యాయత్నం
చెన్నై: మహిళపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యవహారంలోఉత్తర చెన్నై బీజేపీ కార్యదర్శి సెంథిల్(Chennai BJP Secretary Senthil)ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక కొరుక్కుపేట నేతాజీ నగర్‌కు చెందిన రామరాజన్ భార్య నవమణి కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఆమెకు రైల్వేస్టేషన్‌లో దుకాణం ఏర్పాటుచేయిస్తానని నమ్మించి సెంథిల్, ఆమె నుంచి రూ.2.50 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. కానీ, దుకాణం ఏర్పాటుచేయకపోగా, డబ్బు కూడా తిరిగివ్వలేదు. ఈ విషయమై నవమణి కొంతకాలం క్రితం సెంథిల్‌ను ప్రశ్నించగా ఆయన బెదిరించినట్లు తెలిసింది.
ఇదికూడా చదవండి: రౌడీ రాజా దారుణహత్య..
దీంతో మంగళవారం ఇంట్లో పురుగుల మందు తాగి నవమణి ఆత్మహత్యాయత్నం చేసింది. చుట్టుపక్కల వారు ఆమెను స్టాన్లీ ప్రభుత్వాసుపత్రి(Stanley Government Hospital)కి తరలించారు. ఈ వ్యవహారంపై నవమణి భర్త రామరాజన్ తండయార్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. ఈ ఫిర్యాదును విచారించిన పోలీసులు బుధవారం సెంథిల్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jul 04 , 2024 | 01:08 PM