ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: టీచర్ ఆ పని చేసినందుకు.. విద్యార్థి ఏం చేశాడో తెలుసా?

ABN, Publish Date - Jul 06 , 2024 | 10:05 PM

ఒకప్పుడు ఉపాధ్యాయులను విద్యార్థులు దైవంగా భావించేవారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించి, భవిష్యత్తుకు బాట వేసి, జీవితాలకు ఒక రూపం కల్పిస్తారు కాబట్టి.. వారిని ఎంతో గౌరవించేవారు. కానీ..

Assam News

ఒకప్పుడు ఉపాధ్యాయులను విద్యార్థులు దైవంగా భావించేవారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించి, భవిష్యత్తుకు బాట వేసి, జీవితాలకు ఒక రూపం కల్పిస్తారు కాబట్టి.. వారిని ఎంతో గౌరవించేవారు. కానీ.. ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది. ఉపాధ్యాయులంటే విద్యార్థులకు ఏమాత్రం గౌరవం లేకుండా పోయింది. తమపై కాస్త కోపగించుకుంటే చాలు.. ఎదురుదాడులకు దిగుతున్నారు. కొందరు విద్యార్థులు హత్యలు చేసిన దారుణాలు కూడా జరిగాయి. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. తోటి విద్యార్థుల ముందు తనని మందలించాడన్న కోపంతో.. క్లాస్‌రూమ్‌లోనే టీచర్‌ని కత్తితో పొడిచి చంపేశాడు ఓ విద్యార్థి.


అస్సాంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. శివసాగర్ టౌన్‌లో ఓ వ్యక్తి ఒక కోచింగ్ సెంటర్‌లో ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. శనివారం ఉదయం తన క్లాస్‌లో చదువుకునే ఓ మైనర్ విద్యార్థిని (11వ తరగతి) ఆయన ఒక వివాదం విషయంలో మందలించాడు. దీంతో కోపాద్రిక్తుడైన ఆ విద్యార్థి క్లాస్ వదిలి వెళ్లిపోయాడు. కొద్దిసేపయ్యాక మళ్లీ తిరిగొచ్చాడు. అప్పుడు మరోసారి టీచర్ తిట్టాడు. దీంతో కోపం నషాళానికెక్కి.. సదరు విద్యార్థి తనతో పాటు తెచ్చుకున్న కత్తితో టీచర్‌పై దాడి చేశాడు. పలుసార్లు విచక్షణారహితంగా దాడి చేయడంతో.. టీచర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో క్లాస్‌లో ఉన్న విద్యార్థులంతా భయభ్రాంతులకు గురయ్యారు.


పోలీసులకు సమాచారం అందడంతో.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడైన మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ‘‘తన క్లాస్ టీచర్‌ని ఓ విద్యార్థి కత్తితో దాడి చేశాడన్న సమాచారం అందగానే మేము చేరుకున్నాం. క్లాస్ రూమ్‌లో రక్తం అంతా వ్యాపించి ఉంది. మాకు కత్తి కూడా అక్కడే దొరికింది’’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు. టీచర్‌ని వెంటనే ఆసుపత్రికి తరలించారని, కానీ అక్కడికి చేరుకున్నాక అతను చనిపోయాడని వైద్యులు నిర్ధారించారని పేర్కొన్నారు. టీచర్‌పై ఆ స్టూడెంట్ ఎందుకు దాడి చేశాడనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని, తాము సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని అధికారి చెప్పుకొచ్చారు.

Read Latest Crime News and Telugu News

Updated Date - Jul 06 , 2024 | 10:05 PM

Advertising
Advertising
<