Cyber criminals: క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు.. ఎంతంటే..
ABN, Publish Date - Sep 26 , 2024 | 12:47 PM
కార్డ్ క్లోనింగ్ ద్వారా క్రెడిట్ కార్డు నుంచి సైబర్ నేరగాళ్లు(Cyber criminals) డబ్బు కాజేసిన సందర్భంలో బాధితుడికి వివరాలు అందించడంలో జాప్యం చేసిన బ్యాంకు తీరును వినియోగదారుల ఫోరం తప్పుబట్టింది. తిరుమలగిరికి చెందిన శామిర్ పటేల్‌కు ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉంది.
హైదరాబాద్ సిటీ: కార్డ్ క్లోనింగ్ ద్వారా క్రెడిట్ కార్డు నుంచి సైబర్ నేరగాళ్లు(Cyber criminals) డబ్బు కాజేసిన సందర్భంలో బాధితుడికి వివరాలు అందించడంలో జాప్యం చేసిన బ్యాంకు తీరును వినియోగదారుల ఫోరం తప్పుబట్టింది. తిరుమలగిరికి చెందిన శామిర్ పటేల్‌కు ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉంది. క్రెడిట్ కార్డు హైదరాబాద్‌లో శామిర్ పటేల్ వద్ద ఉండగా, 2022 జనవరి 15న అతడి క్రెడిట్ కార్డు నుంచి ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని బరేలిలో ఓ అగంతకుడు 5 సార్లు మొత్తం రూ. 1.91 లక్షల విలువైల వస్తువులు కొనుగోలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితుడు వెంటనే బ్యాంకును సంప్రదించి క్రెడిట్ కార్డు(Credit card)ను బ్లాక్ చేయించాడు.
ఇదికూడా చదవండి: Hyderabad: జల్సాల కోసం చోరీలు చేస్తూ చివరకు ఏమయ్యారో తెలిస్తే..
అంతేకాకుండా 2022 జనవరి 17న హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు నుంచి సరైన సమాచారం రాకపోవడంతో కేసు దర్యాప్తు కొలిక్కి రాలేదని. దీనికి తగిన పరిహారం చెల్లించాలని కోరుతూ బాధితుడు రాష్ట్ర వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. కేసు విచారణ చేపట్టిన రాష్ట్ర వినియోగదారుల ఫోరం ప్రెసిడెంట్ మీనా రంగనాథ్, సభ్యులు వీవీ శేషుబాబు బెంచ్ ఆధారాలను పరిశీలించి ఖాతాదారుడికి సహకరించని బ్యాంకు తీరును తప్పుబట్టింది. మానసిక వేదనకు గురిచేసినందుకు బాధితుడికి రూ.50 వేల పరిహారంతోపాటు కన్జ్యూమర్ లీగల్ ఎయిడ్‌కు రూ. 10 వేలు 30 రోజుల్లో చెల్లించాలని తీర్పును వెలువరించింది.
.................................................
ఈవార్తను కూడా చదవండి:
..................................................
Hyderabad: లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు..
- అభివృద్ధి చేసిన డీఆర్‌డీవో అండ్ ఐఐటీ ఢిల్లీ
హైదరాబాద్: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) ఢిల్లీ పరిశోధకులతో కలిసి అధునాతనమైన బాలిస్టిక్ ఫర్ హై ఎనర్జీ డీఫీట్ (ఏబీహెచ్‌ఈడీ) అనే లైట్ వెయిట్ గల బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్(Bulletproof jacket)లను అభివృద్ధి చేసింది. ఢిల్లీలోని ఐఐటీ, డీఆర్‌డీవో ఇండస్ట్రీ అకాడెమియా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అభివృద్ధి చేశారు. ఈ జాకెట్లు పాలిమర్లు, దేశీయ బోరాన్ కార్బైడ్ సిరామిక్ మెటీరియల్ నుంచి తయారు చేశారు. డీఆర్‌డీవో(DRDO) సహకారంతో డిజైన్, ఆకారాన్ని అధిక ఒత్తిడిని కూడా తట్టుకునే విధంగా రూపొందించారు.
ప్రోటోకాల్(Protocol) ప్రకారం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు రీసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ (ఆర్‌అండ్‌డీ) ఆమోదించాయి. ఇవి 360 డిగ్రీలు వరకు రక్షణ కల్పిస్తాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంపిక చేసిన మూడు పరిశ్రమలకు బదిలీ చేయనున్నారు. డీఆర్‌డీవో చైర్మన్ సమీర్ వీ కామత్ డీఆర్‌డీవో సైంటిస్టులతో పాటు ఐఐటీ ఢిల్లీ విద్యాసంస్థ పరిశోధకులను అభినందించారు. పర్యావరణ వ్యవస్ధకు తక్కువ బరువు గల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉదాహరణగా నిలుస్తుందని డీఆర్‌డీవో బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.
దికూడా చదవండి: తిరుమల లడ్డూ వివాదం వెనుక బీజేపీ కుట్ర..
ఇదికూడా చదవండి: కవిత కేసు విచారణ అక్టోబరు 4కు వాయిదా
ఇదికూడా చదవండి: హై‘డ్రామా’లొద్దు..
Read Latest Telangana News and National News
Updated Date - Sep 26 , 2024 | 12:47 PM