Cyber criminals: డగ్స్, మనీల్యాండరింగ్ పేరుతో మోసం
ABN, Publish Date - Aug 29 , 2024 | 12:47 PM
డ్రగ్స్, మనీల్యాండరింగ్ పేరుతో వృద్ధుడిని బెదిరించి రూ. 1.53 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు(Cyber criminals). నగరానికి చెందిన 84 ఏళ్ల వృద్ధుడికి ఇటీవల గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది.
- వృద్ధుడిని బెదిరించి రూ. 1.53 లక్షల కాజేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ సిటీ: డ్రగ్స్, మనీల్యాండరింగ్ పేరుతో వృద్ధుడిని బెదిరించి రూ. 1.53 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు(Cyber criminals). నగరానికి చెందిన 84 ఏళ్ల వృద్ధుడికి ఇటీవల గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. మీ ఫోన్ డిస్‌కనెక్ట్ చేస్తున్నాం.. ఇతర వివరాలకు 9 నొక్కండి అని చెప్పారు. ఏంటో తెలుసుకుందామని 9వ నంబర్ నొక్కాడు. ఆలంబాగ్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం అంటూ.. ఓ వ్యక్తి మాట్లాడాడు. మీ ఆధార్ కార్డు అడ్రస్‌తో డ్రగ్స్ పార్శిల్ దొరికిందని, మీ ఖాతా నుంచి అక్రమ లావాదేవీలు జరిగాయని, మీపై మనీల్యాండరింగ్ కింద క్రిమినల్ కేసు నమోదైందని చెప్పాడు.
కేసును సీబీఐకి బదిలీ చేస్తున్నామని బెదిరించాడు. మీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును ఆర్‌బీఐ అధీనంలో ఉన్న ఖాతాకు పంపండి. మీ ఖాతాను పరిశీలించి అక్రమాలు లేవని తేలితే డబ్బు తిరిగి జమ చేస్తారని, తప్పించుకోవాలని చూస్తే అరెస్ట్ చేస్తారని భయపెట్టాడు. అలా వృద్ధుడి ఖాతాలో ఉన్న రూ. 1.53 లక్షలు కాజేశారు. తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
....................................................................
ఈ వార్తను కూడా చదవండి:
....................................................................
MLA: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో అవినీతి
- చెక్కుకు రూ.10వేల చొప్పున రెవెన్యూ సిబ్బంది వసూలు
- జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
బంజారాహిల్స్(హైదరాబాద): కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో ఖైరతాబాద్ మండలం రెవెన్యూ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Jubilee Hills MLA Maganti Gopinath) ఆరోపించారు. లబ్ధిదారుల వద్ద చెక్కుకు రూ.10 వేల చొప్పున వసూలు చేస్తున్నారన్నారు. నవోదయకాలనీలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ శాఖలో అవినీతి లీలలు వెలుగులోకి వస్తాయనే ఉద్దేశంతో అధికారులు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ విషయంలో ప్రొటోకాల్‌ను విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. రెండు డివిజన్‌లకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మాత్రమే పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, అధికారులు దీన్ని విస్మరిస్తున్నారన్నారు.
తాజాగా లబ్ధిదారులకు రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్‌తో రహ్మత్‌నగర్‌లో పంపిణీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. కానీ అధికారులు ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(In-charge Minister Ponnam Prabhakar)ను తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారం ఇచ్చి ఖైరతాబాద్ మండల కార్యాలయంలో ఏర్పాటు చేశారని తెలిపారు. రెవెన్యూ సిబ్బంది అవినీతి బాగోతాలపై త్వరలో ఆధారాలతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో కార్పొరేటర్లు దేదీప్యరావు, రాజ్‌కుమార్ పటేల్, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News
Updated Date - Aug 29 , 2024 | 12:47 PM