ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Cyber ​​criminals: స్కైప్‌ యూజర్లే వారి టార్గెట్‌...

ABN, Publish Date - Jun 14 , 2024 | 12:29 PM

స్కైప్‌ యూజర్లే లక్ష్యంగా సైబర్‌నేరగాళ్లు(Cyber ​​criminals) దోపిడీలకు పాల్పడుతున్నారు. పలు కేసుల పేరుతో భయపెట్టి రూ.లక్షలు కాజేస్తున్నారు. నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడు వారి వలలో చిక్కి రూ. 40 లక్షలు పోగొట్టుకున్నాడు. మనీల్యాండరింగ్‌, పార్సిల్‌లో డ్రగ్స్‌ పేరుతో ఓ రిటైర్డ్‌ ఉద్యోగిని బెదిరించి రూ. 20 లక్షలు దోచుకున్నారు.

- కేసుల పేరుతో బెదిరింపులు

- రూ.లక్షలు కాజేస్తున్న సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: స్కైప్‌ యూజర్లే లక్ష్యంగా సైబర్‌నేరగాళ్లు(Cyber ​​criminals) దోపిడీలకు పాల్పడుతున్నారు. పలు కేసుల పేరుతో భయపెట్టి రూ.లక్షలు కాజేస్తున్నారు. నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడు వారి వలలో చిక్కి రూ. 40 లక్షలు పోగొట్టుకున్నాడు. మనీల్యాండరింగ్‌, పార్సిల్‌లో డ్రగ్స్‌ పేరుతో ఓ రిటైర్డ్‌ ఉద్యోగిని బెదిరించి రూ. 20 లక్షలు దోచుకున్నారు. పోలీసు దుస్తులు ధరించిన వ్యక్తులు స్కైప్‌ కాల్‌ చేసి కేసుల పేరుతో బెదిరించి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని సైబర్‌ నిపుణులు ప్రసాద్‌ పాటిబండ్ల తెలిపారు. వాట్సాప్‌, టెలిగ్రాం వంటి యాప్‌లు లేని సమయంలో ఎన్నారైలు, ఐటీ, ఆరోగ్య రంగ నిపుణులు, పలు సంస్థల ఉన్నతాధికారులు విరివిగా స్కైప్‌ను వినియోగించేవారు.

ఇదికూడా చదవండి: Hyderabad: 7 నుంచి గోల్కొండ బోనాలు


ఇప్పటికీ కొందరు స్కైప్‌ను వినియోగిస్తున్నారు. వారి సమాచారం సేకరించిన సైబర్‌ నేరగాళ్లు, వారి గురించి ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు సంస్థల అధికారులమంటూ స్కైప్‌ కాల్స్‌ చేసి భయపెడుతున్నారు. కేసు నుంచి తప్పిస్తామని, ఖాతాలో డబ్బును స్ర్కీనింగ్‌ చేయాలని చెప్పి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. వారి టార్గెట్‌ పూర్తయ్యే వరకు బాధితుడిని ఎవరితో కలవనీయకుండా, ఫిర్యాదు చేయనీయకుండా భయపెట్టి డబ్బులు గుంజుతున్నారు. బాధితుల్లో కొందరికి చట్టాలపై అవగాహన ఉన్నప్పటికీ సైబర్‌ నేరగాళ్ల బెదిరింపులకు లొంగిపోయి, డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మోసగాళ్ల చేతిలో డబ్బులు పోగొట్టుకున్నవారిలో 45 నుంచి 70 ఏళ్ల వారు ఉండటం గమనార్హం.


డబ్బు డిమాండ్‌ చేస్తే మోసమే

కేంద్ర దర్యాప్తు సంస్థల పేర్లు చెప్పి, కేసులు నమోదయ్యాయని భయపెట్టి డబ్బులు వసూలు చేయడాన్ని ‘‘ఫైనాన్షియల్‌ స్వాటింగ్‌’’గా పేర్కొంటారు. ఈడీ, ఐటీ, నార్కొటిక్స్‌, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు వీడియో కాల్స్‌లో నోటీసులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వవు. ఎవరైనా దర్యాప్తు సంస్థల అధికారి అని ఫోన్‌ చేస్తే వెంటనే ఫోన్‌ను పెట్టేసి, పోలీసులకు సమాచారమివ్వండి. ఒకవేళ సైబర్‌ నేరగాళ్లు డబ్బులు తీసుకుంటే వెంటనే 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలి. కేసుల పేరుతో డబ్బు డిమాండ్‌ చేస్తే కచ్చితంగా మోసమేనని గ్రహించాలి.

- ప్రసాద్‌ పాటిబండ్ల, సైబర్‌ నిపుణులు


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 14 , 2024 | 12:29 PM

Advertising
Advertising