మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Video: మద్యం మత్తులో కారుతో మార్కెట్‌లోకి దూసుకెళ్లిన ట్యాక్సీ డ్రైవర్.. ఒకరు మృతి, 15 మందికి గాయాలు

ABN, Publish Date - Mar 14 , 2024 | 09:44 AM

రద్దీగా ఉండే మార్కెట్‌లోకి ఆకస్మాత్తుగా ఓ కారు దూసుకొచ్చింది. దీంతో అక్కడికి వచ్చిన జనాల్లో ఓ 22 ఏళ్ల మహిళ మృత్యువాత చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Video: మద్యం మత్తులో కారుతో మార్కెట్‌లోకి దూసుకెళ్లిన ట్యాక్సీ డ్రైవర్.. ఒకరు మృతి, 15 మందికి గాయాలు

రద్దీగా ఉండే మార్కెట్‌లోకి(Market) ఆకస్మాత్తుగా ఓ కారు(car) దూసుకొచ్చింది(accident). దీంతో అక్కడికి వచ్చిన జనాల్లో ఓ 22 ఏళ్ల మహిళ మృత్యువాత చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. ఈ ఘటన తూర్పు ఢిల్లీ(Delhi)లోని ఘాజీపూర్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆ ట్యాక్సీ డ్రైవర్‌(Taxi Driver)ను పట్టుకుని చితకబాదారు. ఆ క్రమంలో మరికొంత మంది పోలీసులకు సమాచారం అందించారు.

ఇక రంగంలోకి దిగిన పోలీసులు డ్రైవర్‌(driver)ను అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను సమీప లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ ట్యాక్సీ డ్రైవర్ మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు మార్కెట్‌ అంతా జనంతో నిండిపోయిందని, ఆ క్రమంలో కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు.


ఆ ట్యాక్సీ మయూర్ విహార్ ఫేజ్ 3 వైపు వెళుతుండగా ఈ ప్రమాదం(accident) జరిగిందని సమాచారం. వాహనం అదుపు తప్పి అకస్మాత్తుగా ఎడమవైపు తిరగడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు డ్రైవర్ మద్యం మత్తులోనే డ్రైవింగ్ చేశాడా లేదా ఇంకేదైనా కారణం ఉందా అనే కోణాల్లో కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: TS News: నల్లవల్లి హత్య కేసులో వీడిన మిస్టరీ..

Updated Date - Mar 14 , 2024 | 09:44 AM

Advertising
Advertising