ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gas Cylinder Blast: పేలిన గ్యాస్ సిలిండర్ ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు మృతి

ABN, Publish Date - Mar 21 , 2024 | 12:27 PM

ఓ గ్యాస్ సిలిండర్ ఆకస్మాత్తుగా పేలడం(Gas Cylinder Blast)తో ఓ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన రాజస్థాన్‌(rajasthan) జైపూర్‌(jaipur)లోని జస్లా గ్రామంలో చోటుచేసుకుంది.

ఓ గ్యాస్ సిలిండర్ ఆకస్మాత్తుగా పేలడం(Gas Cylinder Blast)తో ఓ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన రాజస్థాన్‌(rajasthan) జైపూర్‌(jaipur)లోని జస్లా గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు(police) రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే మంటలు అదుపులోకి వచ్చేలోపే ఆ కుటుంబం సజీవదహనమైంది. మహిళ వంటగదిలో పనిచేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలిపోయిందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజేంద్ర శర్మ తెలిపారు. ఇంటికి మంటలు(fire) అంటుకోవడంతో ముగ్గురు మైనర్ పిల్లలతో సహా కుటుంబ సభ్యులందరూ సజీవ దహనమయ్యారని చెప్పారు.


బీహార్‌కు చెందిన ఈ కుటుంబం ఓ ఫ్యాక్టరీలో పని చేసేందుకు జైపూర్‌కు వచ్చి విశ్వకర్మ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైస్లా గ్రామంలో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ(bhajan lal sharma) స్పందించారు. మృతుల కుటుంబానికి సోషల్ మీడియా(social media) వేదికగా తన సానుభూతిని తెలియజేశారు. ఈ క్రమంలో క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని కూడా అధికారులకు సూచనలు జారీ చేశారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Banks: మార్చి 31న ఆదివారం కూడా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఓపెన్.. కారణమిదే

Updated Date - Mar 21 , 2024 | 12:29 PM

Advertising
Advertising