Hero Vijay: హీరో విజయ్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు.. విషయం ఏంటంటే..
ABN, Publish Date - Apr 21 , 2024 | 11:34 AM
ఓటు వేసేందుకు పెద్దసంఖ్యలో మద్దతుదారులతో వచ్చారంటూ హీరో విజయ్(Hero Vijay)పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని 40 లోక్‌సభ నియోజకవర్గాలకు శుక్రవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
చెన్నై: ఓటు వేసేందుకు పెద్దసంఖ్యలో మద్దతుదారులతో వచ్చారంటూ హీరో విజయ్(Hero Vijay)పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని 40 లోక్‌సభ నియోజకవర్గాలకు శుక్రవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. నటుడు విజయ్ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు స్థానిక నీలాంగరైలోని పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఆ సమయంలో సుమారు 200 మంది మద్దతుదారులతో విజయ్ రావడంతో, గట్టి బందోబస్తు నడుమ పోలీసులు పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు.
ఇదికూడా చదవండి: Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక నుంచి...
ఈ నేపథ్యంలో, నగరానికి చెందిన ఓ సామాజిక వేత్త నగర పోలీసు కమిషనర్(City Police Commissioner) కార్యాలయంలో విజయ్‌పై ఫిర్యాదు చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఎన్నికల నిబంధనలు అతిక్రమించి 200 మంది కార్యకర్తలతో పోలింగ్ కేంద్రానికి వచ్చాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: Wine Shops: మద్యంషాపులకు పోటెత్తిన మందుబాబులు..
Updated Date - Apr 21 , 2024 | 11:34 AM