ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: 7 నెలలు.., 506 కేసులు

ABN, Publish Date - Aug 22 , 2024 | 12:21 PM

నగరంలో అతివేగం, అజాగ్రత్త, మద్యం మత్తులో ఇతరులను ఢీకొట్టి (హిట్‌ అండ్‌ రన్‌) వాహనాలు ఆపకుండా వెళ్లిపోతున్నారు. రక్తపు మడుగులో ఉన్నా కనీసం దయ చూపకుండా పారిపోతుండడంతో బాధితులు రోడ్లపైన గంటల తరబడి హాహాకారాలు చేస్తున్నారు.

- సైబరాబాద్‌ కమిషనరేట్‌లో హిట్‌ అండ్‌ రన్‌ ప్రమాదాలు

- అతివేగం, నిర్లక్ష్యం, మద్యం మత్తు కారణాలు

- ప్రమాదానికి గురైన బాధితులు రోడ్లపై హాహాకారాలు

- 132 వాహనాల గుట్టు విప్పిన ప్రత్యేక విభాగం

- బుధవారం తెల్లవారుజామున రాజేంద్రనగర్‌ ఫిష్‌ బిల్డింగ్‌ సమీపంలో రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని బైక్‌ వేగంగా ఢీకొన్నది. ఈ ఘటనలో పాదచారుడు దుర్మరణం పాలయ్యాడు.


- మరో ఘటనలో మేడ్చల్‌ హైవేపై ఉదయం 9 గంటల ప్రాంతంలో స్కూటీపై వెళ్తున్న తల్లీకొడుకులను కారు వేగంగా ఢీకొని రెప్పపాటులో మాయమైంది. ఈ ప్రమాదంలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా.. కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.

- ఇటీవల మాదాపూర్‌ కేబుల్‌ బ్రిడ్జిపై ఇద్దరు యువకులు సెల్ఫీ తీసుకుంటుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఒక యువకుడు అక్కడే ప్రాణాలు విడవగా, మరో యువకుడిని పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు.


హైదరాబాద్‌ సిటీ: నగరంలో అతివేగం, అజాగ్రత్త, మద్యం మత్తులో ఇతరులను ఢీకొట్టి (హిట్‌ అండ్‌ రన్‌) వాహనాలు ఆపకుండా వెళ్లిపోతున్నారు. రక్తపు మడుగులో ఉన్నా కనీసం దయ చూపకుండా పారిపోతుండడంతో బాధితులు రోడ్లపైన గంటల తరబడి హాహాకారాలు చేస్తున్నారు. ఒక్క సైబరాబాద్‌ కమిషనరేట్‌(Cyberabad Commissionerate) పరిధిలో ఈ ఏడాది 7 నెలల్లో 506 హిట్‌ అండ్‌ రన్‌ కేసులు నమోదైనట్టు రోడ్డు ట్రాఫిక్‌ యాక్సిడెంట్స్‌ మానిటరింగ్‌ సెల్‌ (ఆర్టీఏఎం) అధ్యయనంలో తేలింది.

ఇదికూడా చదవండి: Hyderabad: పాత ఫోన్లు కొంటారు.. సైబర్‌ నేరాలకు వాడేస్తారు!


గుట్టు విప్పుతున్న ఆర్టీఏఎం విభాగం

హిట్‌ అండ్‌ రన్‌ రోడ్డు ప్రమాదాల గుట్టు రట్టు చేయడానికి సైబరాబాద్‌ కమిషనరేట్‌(Cyberabad Commissionerate)లోని ప్రత్యేక విభాగం ఆర్టీఏఎం సెల్‌ నిరంతరాయంగా పనిచేస్తోంది. ప్రమాదం ఎలా జరిగింది? కారణాలు ఏమిటి? ప్రమాదానికి కారకులెవరు? తదితర పూర్తి వివరాలు సేకరిస్తోంది. ప్రమాదాలను ఛేదించడానికి, సాంకేతిక ఆధారాలను సేకరించి కారకులను పట్టించే వరకు 80 శాతం నేర పరిశోధన పూర్తి చేస్తున్నారు. హిట్‌ అండ్‌ రన్‌(Hit and run) కేసులో మృతిచెందిన లేదా గాయపడిన వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా శతవిధాలా కృషి చేస్తున్నారు. 7 నెలల్లో వెలుగులోకి వచ్చిన 506 హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో ఇప్పటివరకు 132 కేసులను ఛేదించారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 22 , 2024 | 12:23 PM

Advertising
Advertising
<