ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: స్నేహితుడే హంతకుడు...

ABN, Publish Date - Aug 25 , 2024 | 11:18 AM

స్నేహితుడే హంతకుడయ్యాడు. బాలానగర్‌(Balanagar) పీఎస్‌ పరిధిలో జరిగిన బీటెక్‌ విద్యార్థి ప్రశాంత్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమించిన అమ్మాయికి తన గురించి చెడుగా చెబుతున్నాడన్న కక్షతోనే ప్రశాంత్‌ను అతని స్నేహితుడు హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.

- బీటెక్‌ విద్యార్థి ప్రశాంత్‌ హత్య కేసు ఛేదన

- ప్రియురాలికి చెడుగా చెబుతున్నాడని హత్య

- ఏడుగురి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: స్నేహితుడే హంతకుడయ్యాడు. బాలానగర్‌(Balanagar) పీఎస్‌ పరిధిలో జరిగిన బీటెక్‌ విద్యార్థి ప్రశాంత్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమించిన అమ్మాయికి తన గురించి చెడుగా చెబుతున్నాడన్న కక్షతోనే ప్రశాంత్‌ను అతని స్నేహితుడు హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. హంతకుడితో పాటు అతనికి సహకరించిన మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాలాపూర్‌కు చెందిన మహదేవ్‌ యాదవ్‌, ప్రశాంత్‌(Mahadev Yadav, Prashant) ఇద్దరు స్నేహితులు.

ఇదికూడా చదవండి: దేవుడా.. ఎంతపని చేశావయ్యా.. వివాహమైన 13 రోజులకే..


సోషల్‌ మీడియాలో నకిలీ ఖాతాను ప్రారంభించిన ప్రశాంత్‌, మహదేవ్‌యాదవ్‌ ప్రేమించిన అమ్మాయితో చాటింగ్‌ చేసేవాడు. తన గురించి ప్రియురాలికి చెడుగా చెబుతున్నాడని మహదేవ్‌ స్నేహితుడిపై అనుమానపడి కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ప్రశాంత్‌ను అంతమొందించాలని పథకం వేసుకున్నాడు. తన స్నేహితులు నాదర్‌గుల్‌కు చెందిన చింతల మహేష్‌ యాదవ్‌(25), రామోజు సుమంత్‌చారి(21), బాలాపూర్‌కు చెందిన నల్లపూసల మహేష్‌(24), దొడ్డి హరీష్‌(23), మాదాపురం అఖిల్‌ కిరణ్‌కుమార్‌(20), కోహెడ యశ్వంత్‌(19)లతో కలిసి పథకం పన్నాడు.


అందులో భాగంగా ఈనెల 22న బాలాపూర్‌లోని మండీ వద్దకు ప్రశాంత్‌ను పిలిచాడు. మాటామాటా పెరగడంతో మహాదేవ్‌ కత్తితో ప్రశాంత్‌ను పొడిచాడు. తీవ్రగాయాలు కావడంతో ప్రశాంత్‌ అక్కడికక్కడే చనిపోయాడు. దాడి చేసిన అనంతరం మహదేవ్‌.. అతని స్నేహితులతో పాటు పరారయ్యాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బాలాపూర్‌ పోలీసులు కుర్మగూడ హెచ్‌పీ గోదాం వద్ద నిందితులను అరెస్ట్‌ చేశారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 25 , 2024 | 11:18 AM

Advertising
Advertising
<