Share News

Hyderabad: నీళ్ల బకెట్లో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి

ABN , Publish Date - Nov 07 , 2024 | 07:55 AM

అప్పటివరకు గెంతులేసింది.. బోసినవ్వులతో ఇళ్లంతా సందడి చేసింది. విధి వక్రీకరించిందేమో.. ఆడుకుంటూ బాత్రూమ్‌ వద్దకెళ్లి నీళ్ల బకెట్లో పడి ఏడాదిన్నర చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ విషాద ఘటన ఖైరతాబాద్‌ ఇందిరానగర్‌(Khairatabad Indiranagar)లో చోటుచేసుకుంది.

Hyderabad: నీళ్ల బకెట్లో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి

- కుటుంబ సభ్యులు భోజనం చేస్తుండగా విషాదం

ఖైరతాబాద్‌(హైదరాబాద్): అప్పటివరకు గెంతులేసింది.. బోసినవ్వులతో ఇళ్లంతా సందడి చేసింది. విధి వక్రీకరించిందేమో.. ఆడుకుంటూ బాత్రూమ్‌ వద్దకెళ్లి నీళ్ల బకెట్లో పడి ఏడాదిన్నర చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ విషాద ఘటన ఖైరతాబాద్‌ ఇందిరానగర్‌(Khairatabad Indiranagar)లో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. స్థానికంగా డబుల్‌ బెడ్రూం కాలనీ బీ బ్లాక్‌లో నివసించే సతీశ్‌, రేణుక(Satish, Renuka) దంపతులకు అద్విక (ఏడాదిన్నర) కూతురు ఉంది.

ఈ వార్తను కూడా చదవండి: Metta Saikumar: బండి సంజయ్‌తో కుమ్మక్కయి కాంగ్రెస్‌ను విమర్శిస్తవా?


మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో కుటుంబసభ్యులు భోజనం చేస్తుండగా.. అద్విక ఆడుకుంటూ బాత్రూమ్‌లో బకెట్‌ వద్దకు వెళ్లి నీటిలో బోర్లాపడిపోయింది. కాసేపటి తర్వాత తల్లి రేణుక(Renuka) పాప కోసం వెతుకుతుండగా బకెట్‌లో కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.


ఈవార్తను కూడా చదవండి: యాదగిరిగుట్ట ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్‌!

ఈవార్తను కూడా చదవండి: కేశవాపురం వద్దు.. మేఘా కాంట్రాక్టు రద్దు

ఈవార్తను కూడా చదవండి: అరుణాచల ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఈవార్తను కూడా చదవండి: తీన్మార్ మల్లన్నకు స్ట్రాంగ్ వార్నింగ్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 07 , 2024 | 07:56 AM