Hyderabad: కట్నం వేధింపులు తాళలేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
ABN, Publish Date - Oct 12 , 2024 | 09:12 AM
అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త వేధింపులు తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్(Software Engineer) ఆత్మహత్య చేసుకుంది. కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా నందిపేట్ గ్రామానికి చెందిన రావుల సుప్రియారెడ్డి(26)కి, అదే జిల్లా లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మదురు రాఘవేందర్‌రెడ్డి(Raghavender Reddy)తో ఈ ఏడాది మార్చిలో వివాహమైంది.
- హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఫిర్యాదు
హైదరాబాద్: అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త వేధింపులు తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్(Software Engineer) ఆత్మహత్య చేసుకుంది. కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా నందిపేట్ గ్రామానికి చెందిన రావుల సుప్రియారెడ్డి(26)కి, అదే జిల్లా లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మదురు రాఘవేందర్‌రెడ్డి(Raghavender Reddy)తో ఈ ఏడాది మార్చిలో వివాహమైంది. వివాహ సమయంలో సుప్రియరెడ్డి తల్లిదండ్రులు కట్నకానుకల కింద 25 తులాల బంగారు ఆభరణాలు, రూ.20లక్షల నగదు ఇచ్చారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: 24/7 చోరీలే పని.. వయసు 42.. చోరీలు 107
కొత్త దంపతులు కూకట్‌పల్లి శంషిగూడలో కాపురం పెట్టారు. రాఘవేందర్‌రెడ్డి మాదాపూర్(Madapur)లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వివాహమైన నెల తర్వాత నుంచి అదనపు కట్నంగా మూడు ఎకరాల పొలం కావాలంటూ సుప్రియారెడ్డిని రాఘవేందర్‌రెడ్డి వేధించడం మొదలుపెట్టాడు. సుప్రియరెడ్డి తల్లి కవిత అతడికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా ఆమెపై కూడా దాడి చేశాడు. ఈక్రమంలో భార్యాభర్తల మధ్య గురువారం ఘర్షణ చోటుచేసుకుంది.
సుప్రియరెడ్డి(Supriya Reddy) తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి రాఘవేందర్‌రెడ్డితో కాపురం చేయలేనని, పుట్టింటికి వచ్చేస్తానని తెలిపింది. అనంతరం రాఘవేందర్‌రెడ్డి ఆఫీ్‌సకు వెళ్లిన కొంతసేపటికి సుప్రియరెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని వారి ఇంటి ఇరుగుపొరుగు వారు సుప్రియారెడ్డి తల్లిదండ్రులకు ఫోన్‌చేసి తెలిపారు. హుటాహుటిన మహబూబ్‌నగర్ నుంచి నగరానికి చేరుకున్న తల్లిదండ్రులు రావుల బుచ్చిరెడ్డి, కవిత అదనపు కట్నం కోసం రాఘవేందర్‌రెడ్డే హత్యచేసి ఆత్యహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపించారు. ఈమేరకు పోలీసులు ఫిర్యాదు చేశారు.
ఇదికూడా చదవండి: Kishan Reddy: దమ్ముంటే.. ‘మూసీ దర్బార్’ పెట్టాలి
ఇదికూడా చదవండి: Gaddar: తూప్రాన్ లిఫ్టు ఇరిగేషన్‌కు గద్దర్ పేరు
ఇదికూడా చదవండి: సురేఖ అంశంపై అధిష్ఠానం వివరణ కోరలేదు
ఇదికూడా చదవండి: Uttam: డిసెంబరులో ఎన్డీఎస్‌ఏ తుది నివేదిక!?
Read Latest Telangana News and National News
Updated Date - Oct 12 , 2024 | 09:12 AM