ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: మహిళను బెదిరించి రూ.6.45 లక్షలు లూటీ చేసేశారు..

ABN, Publish Date - Jun 13 , 2024 | 11:31 AM

సీబీఐ దర్యాప్తు చేస్తున్న మనీలాండరింగ్‌ కేసులో మీ బ్యాంకు ఖాతా నుంచి లావాదేవీలు జరిగాయని బెదిరించిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) ఆమె ఖాతా నుంచి రూ. 6.45లక్షలు లూటీ చేశారు.

హైదరాబాద్‌ సిటీ: సీబీఐ దర్యాప్తు చేస్తున్న మనీలాండరింగ్‌ కేసులో మీ బ్యాంకు ఖాతా నుంచి లావాదేవీలు జరిగాయని బెదిరించిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) ఆమె ఖాతా నుంచి రూ. 6.45లక్షలు లూటీ చేశారు. షాక్‌ నుంచి తేరుకున్న మహిళ మోసపోయినట్లు గుర్తించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు(Cybercrime Police) ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ గృహిణికి ఇటీవల గుర్తుతెలియని నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. అవతలి వ్యక్తి తాను టెలీకామ్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. ముంబైలోని కనకియా పోలీస్ స్టేషన్‌లో మీపై కేసు నమోదైంది.

ఇదికూడా చదవండి: TGSRTC: ఆర్టీసీ గమ్యం యాప్‌ సేవలు అంతంతేగా..!


మీ ఫోన్‌ నంబర్‌ నుంచి అసభ్య మెసేజ్‌లు, నేరపూరితమైన నకిలీ ప్రకటనలు సర్క్యులేట్‌ అయినట్లు, మీ బ్యాంకు ఖాతా నుంచి అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు తేలిందని చెప్పాడు. మీపై నమోదైన క్రిమినల్‌ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు చూపిస్తామని నమ్మించిన నేరగాళ్లు.. బాధితురాలితో స్కైప్‌ కాల్‌లో మాట్లాడారు. ఆమె ఆధార్‌ కార్డు, కెనరా బ్యాంకు ఖాతాలో లింకు చేసిన ఆధార్‌ కార్డు అక్కటే అని చూపించారు. ఈ కేసును సీబీఐ అధికారులు విచారిస్తున్నారని, సుప్రీం కోర్టు నుంచి మీపై అరెస్టు వారెంట్‌ జారీ అయిందని చూపించారు. జెట్‌ ఏయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేష్‌ గోయల్‌ చేసిన రూ. 200కోట్ల కుంభకోణంలో మీ పాత్ర ఉన్నట్లు, ఆ మనీ లాండరింగ్‌లో మీ కెనరా బ్యాంకు ఖాతా నుంచి అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు లభించాయని నకిలీ పత్రాలు చూపించి భయపెట్టారు.


ఏ క్షణమైనా మిమ్మల్ని అరెస్టు చేస్తారని బెదిరించారు. ఈకేసులోంచి బయటపడాలంటే మీ ఖాతాలో ఉన్న నగ దు మొత్తాన్ని ఆర్‌బీఐ ఆధీనంలో ఉన్న ఖాతాకు బదిలీ చేయండి, మీ అకౌంట్‌ లావాదేవీలు అన్ని సక్రమంగానే ఉన్నాయని తేల్చిన తర్వాత మీ డబ్బులు యథావిధిగా మీ ఖాతాలో జమ చేస్తారని నమ్మించారు. దాంతో బాధిత మహిళ తన ఖాతాలోని డబ్బులు వారు చెప్పిన అకౌంట్‌కు బదిలీ చేసింది. ఆ వెంటనే నిందితులు కాల్‌ కట్‌ చేశారు. తర్వాత షాక్‌ నుంచి కోలుకున్న మహిళ జరిగిన విష యం కుటుంబ సభ్యులకు చెప్పింది. ఇదంతో ఏదో మోసంలా ఉందని గుర్తించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 13 , 2024 | 11:31 AM

Advertising
Advertising