Hyderabad: యువతిపై ప్రేమోన్మాది దాడి..
ABN, Publish Date - Dec 26 , 2024 | 07:47 AM
యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడిచేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్(Malakpet Police Station) పరిధిలో బుధవారం జరిగింది.
హైదరాబాద్: యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడిచేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్(Malakpet Police Station) పరిధిలో బుధవారం జరిగింది. మలక్‌పేట ఇన్‌స్పెక్టర్ నరేష్(Malakpet Inspector Naresh) తెలిపిన వివరాల ప్రకారం.. ముసారాంబాగ్ శాలివాహననగర్‌కాలనీకి చెందిన ప్రేమోన్మాది వెంకట్ (30) పొరిగింట్లో నివాసముంటున్న యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని లేకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మూతపడిన ఈవెనింగ్ క్లినిక్స్..
ఆమె అంతగా పట్టించుకోలేదు. బుధవారం సాయంత్రం ఆమె తన ఇంటి మేడపైకి వెళ్లింది. దీంతో వెంకట్ కత్తితో ఆమెపై దాడిచేశాడు. చేతులకు, కడుపు భాగంలో గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సచేయిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని మలక్‌పేట పోలీసులు తెలిపారు. వెంకట్‌ను మలక్‌పేట పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.. కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Investigation: కర్త, కర్మ, క్రియ.. కేటీఆరే!
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: జానీ మాస్టర్ లైంగిక వేధింపులు నిజమే
ఈవార్తను కూడా చదవండి: ఆహా.. ఏం ఐడియాగురూ.. వాట్సాప్ డీపీ మార్చి.. మెసేజ్ పంపి..
ఈవార్తను కూడా చదవండి: Pneumonia: పిల్లలపై న్యుమోనియా పంజా
Read Latest Telangana News and National News
Updated Date - Dec 26 , 2024 | 07:47 AM