Hyderabad: ఆహా.. ఏం ఐడియా గురూ.. ఉల్లిపాయల బస్తాల మాటున నిషేధిత విత్తనాల రవాణా
ABN, Publish Date - Apr 23 , 2024 | 11:38 AM
ఉల్లి లోడు కింద నిషేధిత బీటీ 3 హెచ్‌టీ పత్తి విత్తనాలను రవాణా చేస్తున్న ఇద్దరిని మేడ్చల్ ఎస్‌ఓటీ, షామీర్‌పేట పోలీసులు(Medchal SOT, Shamirpet Police) కలిసి పట్టుకున్నారు. రూ.19.20 లక్షల విలువైన నిషేధిత విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.
రూ.19.20 లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం
హైదరాబాద్ సిటీ: ఉల్లి లోడు కింద నిషేధిత బీటీ 3 హెచ్‌టీ పత్తి విత్తనాలను రవాణా చేస్తున్న ఇద్దరిని మేడ్చల్ ఎస్‌ఓటీ, షామీర్‌పేట పోలీసులు(Medchal SOT, Shamirpet Police) కలిసి పట్టుకున్నారు. రూ.19.20 లక్షల విలువైన నిషేధిత విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల బెల్లంపల్లికి చెందిన గడ్డం శ్రీకాంత్(38), గోదావరి ఖనికి చెందిన గోషిక నవీన్‌కుమార్(31) డ్రైవర్లు, వారు మందమర్రికి చెందిన మినీట్రక్ యజమాని పిండి సురేష్ వద్ద పనిచేస్తున్నారు. సురేష్ ఆదేశాల మేరకు పత్తి విత్తనాలను తెచ్చేందుకు ఇద్దరు కర్ణాటక(Karnataka) కొప్పలి జిల్లా కుస్తగిరి ప్రాంతానికి వెళ్లారు.
ఇదికూడా చదవండి: Hyderabad: హాస్టల్ సంపులో పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
అక్కడి ఓ వ్యక్తి నుంచి విత్తనాలు తీసుకున్నారు. అనుమానం రాకుండా ఉండేందుకు ఉల్లిపాయలు కొనుగోలు చేసి వాటిపై ఉంచారు. విత్తనాలు, ఉల్లిపాయలు లోడు చేసుకొని మంచిర్యాల బయలుదేరారు. పక్కా సమాచారంతో షామీర్‌పేట ఆరెంజ్‌బౌల్ రెస్టారెంట్ వద్ద నిఘా పెట్టిన మేడ్చల్ ఎస్‌ఓటీ, షామీర్‌పేట పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. 1200 కిలోల నిషేధిత పత్తి విత్తనాలు, 1560 కిలోల ఉల్లిపాయలు, బొలేరే క్యారేజ్ వాహనం రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: ఫుట్‌పాత్‌లు, ఆటోల్లో నిద్రిస్తున్న వారే టార్గెట్...
Read More Crime News and Telugu News
Updated Date - Apr 23 , 2024 | 11:38 AM