Hyderabad: వాటర్‌బోర్డు విజిలెన్స్ పేరుతో వసూళ్లు
ABN, Publish Date - Oct 12 , 2024 | 11:45 AM
వాటర్‌బోర్డు విజిలెన్స్(Waterboard vigilance) విభాగానికి చెందిన అధికారిని అంటూ అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అధికారుల వివరాల ప్రకారం.. వాటర్ బోర్డు డివిజన్-6లోని జూబ్లీహిల్స్ సెక్షన్ పరిధిలో ప్రైవేట్ ట్యాంకర్ డ్రైవర్‌గా ఎస్.వంశీకృష్ణ అనే వ్యక్తి పనిచేస్తున్నారు.
- వ్యక్తిపై కేసు నమోదు చేసిన అధికారులు
హైదరాబాద్ సిటీ: వాటర్‌బోర్డు విజిలెన్స్(Waterboard vigilance) విభాగానికి చెందిన అధికారిని అంటూ అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అధికారుల వివరాల ప్రకారం.. వాటర్ బోర్డు డివిజన్-6లోని జూబ్లీహిల్స్ సెక్షన్ పరిధిలో ప్రైవేట్ ట్యాంకర్ డ్రైవర్‌గా ఎస్.వంశీకృష్ణ అనే వ్యక్తి పనిచేస్తున్నారు. అర్రా సాయికుమార్ అలియాస్ సాయిరామ్ అనే వ్యక్తి తాను వాటర్‌బోర్డు విజిలెన్స్ విభాగంలో పని చేస్తున్నానని ఫోన్ చేశాడు. బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ట్యాంకర్ పనిచేస్తోందంటూ రూ.20 వేలు ఇవ్వాలంటూ డ్రైవర్ వంశీకృష్ణను డిమాండ్ చేశాడు. తర్వాత అతని దగ్గరి నుంచి రూ.3 వేలు వసూలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. అర్రా సాయికుమార్ వాటర్‌బోర్డుకి చెందిన వ్యక్తి కాదని, కేవలం బోర్డు పేరు చెప్పుకొని అక్రమంగా డబ్బు వసూలు చేశాడని అందులో తేలింది.
ఈ వార్తను కూడా చదవండి: Telangana: సొంతిల్లు కావాలంటే.. ఇలా చేయండి చాలు..
దీంతో వంశీకృష్ణ ఖైరతాబాద్ పోలీస్ ేస్టషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫలితంగా అర్రా సాయికుమార్ అలియాస్ సాయిరామ్‌పై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎవరైనా వాటర్‌బోర్డు ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, బోర్డుకు చెడ్డ పేరు తీసుకువచ్చేలా ప్రవర్తిేస్త.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. విజిలెన్స్ విభాగంలో కొందరు వాటర్‌బోర్డు డివిజన్లు, సెక్షన్లలో బెదిరింపులకు దిగుతున్నారు. ఇలా వాటర్‌బోర్డు డివిజన్లలోని జీఎం నుంచి మేనేజర్లు, సెక్షన్ సిబ్బందిని, చివరకు ట్యాంకర్ల డ్రైవర్లు, యజమానులను కూడా బెదిరింపులకు దిగుతున్నారు. అక్రమార్కులు విజిలెన్స్ పేరుతో బెదిరింపులకు దిగుతుండడం విశేషం. వాటర్‌బోర్డు ఉన్నతాధికారులు గుర్తించి విజిలెన్స్ పేరుతో జరుపుతున్న అక్రమ వసూళ్లుపై కఠిన చర్యలు చేపట్టాలని వాటర్‌బోర్డులోని పలువురు ఇంజనీర్లు కోరుతున్నారు.
.......................................................
ఈ వార్తను కూడా చదవండి:
........................................................
Hyderabad: కేసీఆర్ బాధితులు చాలామంది ఉన్నారు..
- మాజీ ఎంపీ రవీంద్రనాయక్
హైదరాబాద్: ఉద్యమం ముసుగులో మాజీ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలు, ఉద్యమకారులను తీవ్రంగా మోసం చేశారని మాజీ ఎంపీ రవీంద్రనాయక్(Ravindra Naik) ఆరోపించారు. ఆయ న బాధితులు చాలామంది ఉన్నారని, టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ్యుడిగా ఉన్న తనను తెలంగాణ భవన్ నుంచి బయటకు గెంటేశారని అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అప్పుల పాల్జేసిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కుతుందని, పదేళ్లలో సుమారు రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలన చేస్తున్నారని, ఆయనకు రాష్ట్రప్రజలు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఎంతోమంది నాయకుల రాజకీయ భవిష్యత్తుతో ఆడుకొని, వారిని పార్టీ నుంచి బయటకు పంపారని.. గిరిజనులు, మహిళలకు టికెట్లు ఇవ్వలేదన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత క్విడ్‌ప్రో పేరుతో వేలాది ఎకరాల అసైన్డ్, నయీం, దేవాదాయ, వక్ఫ్, మిగులు భూములు కబ్జా చేయడమే కాకుండా వాటిని మాయం చేశారని ఆరోపించారు. ఆయన వల్లనే కూతురు కవిత(Kavitha) జైలు పాలైందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో వందల సంఖ్యలో చెరువులు కనుమరుగయ్యాయని, మళ్లీ కేసీఆర్ కుటుంబంలో ఎవరు సీఎం అయినా తెలంగాణ నాశనం తప్పదని పేర్కొన్నారు. కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలను అడ్డుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
ఇదికూడా చదవండి: Kishan Reddy: దమ్ముంటే.. ‘మూసీ దర్బార్’ పెట్టాలి
ఇదికూడా చదవండి: Gaddar: తూప్రాన్ లిఫ్టు ఇరిగేషన్‌కు గద్దర్ పేరు
ఇదికూడా చదవండి: సురేఖ అంశంపై అధిష్ఠానం వివరణ కోరలేదు
ఇదికూడా చదవండి: Uttam: డిసెంబరులో ఎన్డీఎస్‌ఏ తుది నివేదిక!?
Read Latest Telangana News and National News
Updated Date - Oct 12 , 2024 | 11:45 AM