Hyderabad: రాగి + ఇనుము = బంగారం...
ABN, Publish Date - Jun 19 , 2024 | 10:47 AM
‘కస్టమ్స్ వారు సీజ్ చేసిన బంగారం.. అతి తక్కువ ధరకే విక్రయం’ అంటూ నకిలీ బంగారాన్ని అంటగడుతున్న ముఠా మోసాల తీరును చూస్తే విస్తుపోవాల్సిందే. రాచకొండ పోలీసులు(Rachakonda Police) అరెస్టు చేసినన ముఠా నాయకుడు విజయ్‌కుమార్, అతడి అనుచరులు సెంథిల్, హరీష్, ఓం సాయికిరీటీల నకిలీ లీలలు మామూలుగా లేవు.
- సినిమా షూటింగ్‌ల కోసమంటూ భారీగా తయారీ
- అసలైన బంగారమంటూ విక్రయాలు
- రూ.కోట్లు కొల్లగొట్టి జల్సాలు
- ముఠా నాయకుడికి ఇంధ్రభవనం లాంటి ఇల్లు
- పిల్లల ఫీజులకు రూ. 16 లక్షలు చెల్లింపు
హైదరాబాద్ సిటీ: ‘కస్టమ్స్ వారు సీజ్ చేసిన బంగారం.. అతి తక్కువ ధరకే విక్రయం’ అంటూ నకిలీ బంగారాన్ని అంటగడుతున్న ముఠా మోసాల తీరును చూస్తే విస్తుపోవాల్సిందే. రాచకొండ పోలీసులు(Rachakonda Police) అరెస్టు చేసినన ముఠా నాయకుడు విజయ్‌కుమార్, అతడి అనుచరులు సెంథిల్, హరీష్, ఓం సాయికిరీటీల నకిలీ లీలలు మామూలుగా లేవు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇదికూడా చదవండి: Revanth Reddy: త్యాగం, వారసత్వం, పోరాటం రాహుల్ తత్వం..
పంజాబ్‌లో తయారీ..
సులభంగా డబ్బు సంపాదించాలని పథకం వేసిన నిందితులు పంజాబ్‌లో నకిలీ బంగారం తయారు చేయిస్తున్నట్లు తెలిసింది. ఇనుము, రాగిని కలిపి బంగారు బిస్కెట్లగా మార్చి వాటిపైన గోల్డ్ కోటింగ్ వేయించినట్లు పోలీసులు గుర్తించారు. సినిమా షూటింగ్‌ల్లో వినియోగించడానికని వాటిని తయారు చేయించినట్లు గుర్తించారు. వారి వద్ద కోట్ల రూపాయల నకిలీ కరెన్సీని సైతం పోలీసులు కనుగొన్నారు. వాటిని కూడా సినిమా షూటింగ్‌ల పేరు చెప్పి తయారు చేయించినట్లు తెలిసింది. అయితే నకిలీ కరెన్సీని నిందితులు ఎక్కడా చెలామణి చేయకపోవడం గమనార్హం. కేవలం బంగారం కొనుగోలు చేయడానికి వచ్చిన కస్టమర్లను బురిడీ కొట్టించడానికి మాత్రమే ఆకర్షణగా పెడుతున్నారు. తన ముఠాలోని కొంతమంది బంగారం కొనడానికి వచ్చిన కస్టమర్లలా నటించి కేజీలకొద్ది బంగారం కొనుగోలు చేస్తారు. నిజంగానే కొనడానికి వచ్చిన వారు అదంతా చూసి బంగారం అయిపోతుందని భావించి కొనేలా ప్లాన్ చేస్తారు. అనంతరం బంగారం కొన్నవారిని ముఠాలోని ఇతర సభ్యులు ఫాలో చేస్తారు. పోలీస్ డ్రెస్‌లు వేసుకొని మార్గమధ్యలో వారిని అడ్డుకుంటారు. పోలీసుల్లా వాహన తనిఖీలు చేస్తూ, ఎలాంటి రసీదు లేకుండా ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకుంటారు. దొంగ బంగారం విక్రయిస్తున్నట్లు కేసులు పెట్టి జైలు నుంచి బయటకు రాకుండా చేస్తామని బెదిరించి ఆ బంగారంతో ఉడాయిస్తారని పోలీసుల విచారణలో తేలింది. అప్పనంగా కోట్ల రూపాయల డబ్బులు కొట్టేయడంతో పాటు, వారు విక్రయించిన నకిలీ బంగారాన్ని కూడా తిరిగి వారే కొట్టేస్తున్నారు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారు.
రూ.లక్షలు వెచ్చించి పిల్లలకు చదువులు
ముఠా నాయకుడు కాడెద్దుల విజయ్‌కుమార్ అలియాస్ కృష్ణమోహన్ చౌదరిని విచారించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిసినట్లు సమాచారం. అతనికి ముగ్గురు పిల్లలు. నెల్లూరు జిల్లా కావలిలో అతడికి రౌడీషీటర్‌గా పేరుండటం, కేసులు నమోదు కావడంతో పిల్లల చదువును చెన్నైకి మార్చినట్లు గుర్తించారు. ఖరీదైన కార్పొరేట్ రెసిడెన్షియల్ కళాశాలలో ఒక్కొక్కరికి రూ. 8లక్షల చొప్పున ఇద్దరు పిల్లలకు ఫీజులు చెల్లించినట్లు తేలింది. ఆ డబ్బంతా ఇలా నకిలీ గోల్డ్ దందాలో కస్టమర్లను మోసం చేసి కొల్లగొట్టిన కోట్ల రూపాయలేనని పోలీసులు గుర్తించారు. ఆ డబ్బును కూడా రికవరీ చేయడానికి పోలీసులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు కావలిలో ఇంధ్రభవనం లాంటి పెద్ద ఇల్లు నిర్మించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ దందాలో ఇప్పటి వరకు ఎంతమందిని మోసం చేశాడు..? ఎన్ని కోట్లు సంపాదించాడు..? ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశాడు..? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 19 , 2024 | 10:51 AM