Hyderabad: ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్స్ కోసం గాల్లోకి కరెన్సీ నోట్లు..
ABN, Publish Date - Aug 23 , 2024 | 01:10 PM
ఇన్‌స్ర్టాగ్రామ్(Instagram)లో లైక్స్ కోసం ఓ యువకుడు రూ.50వేల కరెన్సీ నోట్లను గాల్లోకి విసురుతూ హల్‌చల్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది.
- కూకట్‌పల్లిలో యువకుడి హల్‌చల్.. వీడియో వైరల్
- సుమోటోగా కేసు నమోదు చేస్తామన్న సీఐ
హైదరాబాద్: ఇన్‌స్ర్టాగ్రామ్(Instagram)లో లైక్స్ కోసం ఓ యువకుడు రూ.50వేల కరెన్సీ నోట్లను గాల్లోకి విసురుతూ హల్‌చల్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది. జేఎన్‌టీయూ నుంచి కూకట్‌పల్లి(Kukatpally) మీదుగా భరత్‌నగర్ వరకు రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) బైక్‌పై నిల్చోని కరెన్సీని గాల్లోకి విసిరాడు. కేపీహెచ్‌బీ సర్వీసు రోడ్డు(KPHB Service Road), మెట్రో స్టేషన్, కూకట్‌పల్లిలోని రద్దీ ప్రాంతాల్లో నగదు గాల్లోకి విసురుతూ వాటిని ఏరుకునేందుకు జనం ఎగబడ్డప్పుడు రాక్షసానందం పొందాడు. ఇది ఇలా ఉండగా ఈ వీడియోలు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో చేసినవి అయి ఉంటాయని ప్రాథమికంగా భావిస్తున్నట్లు కూకట్‌పల్లి సీఐ కొత్తపల్లి ముత్తు తెలిపారు. సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.
................................................................................................
ఈ వార్తను కూడా చదవండి:
.................................................................................................
Hyderabad: విదేశీ మహిళలతో వ్యభిచారం..
- నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు
రాయదుర్గం(హైదరాబాద్): విదేశీ మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టును ఎస్‌వోటీ పోలీసులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌వోటీ పోలీసులు బుధవారం రాత్రి 8గంటలకు కొండాపూర్ ప్రొఫెసర్స్ కాలనీ(Kondapur Professors Colony)లోని మూడు అంతస్తుల భవనంలో తనిఖీలు నిర్వహించి 17మంది మహిళలను రక్షించారు.
వీరిలో కెన్యాకు చెందిన 14 మంది మహిళలు, ఉగండాకు చెందిన - 2, టాంజానియాకు చెందిన మహిళను రక్షించి అపార్ట్‌మెంట్ నిర్వాహకుడు శివకుమార్, మరో ఇద్దరు విట్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్(Madapur ACP Srikanth) తెలిపారు. శివకుమార్ విదేశాల నుంచి మహిళలను అక్రమంగా తీసుకువచ్చి ఇక్కడ ఆన్‌లైన్‌లో కస్టమర్లకు గ్రూపు క్రియేట్ చేసి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది.
మహిళలను అక్రమ రవాణా చేస్తూ ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు, హైదరాబాద్(Delhi, Mumbai, Bangalore, Hyderabad)లో వ్యభిచారం నిర్వహస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, రూ.20వేల నగదు, 104 కండోమ్‌లు, హుక్కాపాట్స్, హెచ్‌ఐవీ కిట్‌లు 25, సెక్స్ టాయ్‌లు 3, ల్యాప్‌టాప్, ట్యాబ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News
Updated Date - Aug 23 , 2024 | 01:12 PM