ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: గోనె సంచిలో డెడ్‌బాడీ..

ABN, Publish Date - Dec 25 , 2024 | 08:20 AM

ఓ యువకుడిని హత్య చేసి గోనె సంచిలో మూటకట్టి రోడ్డు పక్కన పడేశారు. గోనె సంచి నుంచి దుర్వాసన రావడం గమనించిన పారిశుధ్య కార్మికులు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ జగన్మోహన్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- యువకుడిని చంపి మూటకట్టి రోడ్డు పక్కన పడేశారు..

హైదరాబాద్: ఓ యువకుడిని హత్య చేసి గోనె సంచిలో మూటకట్టి రోడ్డు పక్కన పడేశారు. గోనె సంచి నుంచి దుర్వాసన రావడం గమనించిన పారిశుధ్య కార్మికులు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ జగన్మోహన్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన రాజేంద్రనగర్‌ సర్కిల్‌ మైలార్‌దేవుపల్లి పోలీస్‌స్టేషన్‌(Rajendranagar Circle Mailardevupalli Police Station) పరిధిలోని దుర్గానగర్‌లో వెలుగుచూసింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: స్నేహితుని బర్త్‌ డే సెలబ్రేట్‌ చేసి మాట్లాడుతుండగా...


దుర్గానగర్‌ నుంచి ఆరాంఘర్‌ చౌరస్తాకు వెళ్లే మార్గంలో నీరు లేని డ్రైనేజీ కాలువలో గోనె సంచిలో యువకుడి మృతదేహాన్ని కట్టి పడవేశారు. మంగళవారం రోడ్లు శుభ్రం చేస్తున్న పారిశుధ్య సిబ్బందికి గోనె సంచిలోంచి దుర్వాసన రాగా, వారు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ జగన్మోన్‌(Sanitary Inspector Jaganmon)కు సమచారం అందించారు. ఆయన వచ్చి చూసి విషయాన్ని మైలార్‌దేవుపల్లి పోలీసులకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో సంఘటనా స్థలానికి మైలార్‌దేవుపల్లి ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ చేరుకుని వివరాలు సేకరించారు.


నాలుగు రోజుల క్రితం 30నుంచి 35 సంవత్సరాల వయస్సు గల యువకుడిని గొంతునులిమి హత్య చేసి ఇక్కడ పడవేసి ఉంటారని అనుమానిస్తున్నారు. నల్లని గడ్డం, నలుపు రంగు టీ షర్టు ధరించి ఉన్నాడన్నారు. అతనికి సంబంధించిన వారు ఉంటే మైలార్‌దేవుపల్లి పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు. లేదా 9490617267, 9490617459 నంబర్‌లలో సంప్రదించవచ్చన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: తప్పయిపోయింది!

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: తప్పు జరిగితే.. వేటు తప్పదు!

ఈవార్తను కూడా చదవండి: నేడు, రేపు మోస్తరు వర్షాలు

ఈవార్తను కూడా చదవండి: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 25 , 2024 | 08:20 AM