Hyderabad: సీబీఐ అధికారినని బెదిరించి.. ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.48 లక్షలు కాజేశారు..
ABN, Publish Date - Nov 08 , 2024 | 10:30 AM
తాను సీబీఐ అధికారినని, మీ బ్యాంకు ఖాతాల్లో అక్రమ లావాదేవీలు జరిగాయంటూ సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ఓ ప్రభుత్వ ఉద్యోగిని బోల్తా కొట్టించారు. తాము చెప్పినట్లు వినకుంటే అరెస్ట్ తప్పదంటూ బెదిరించి రూ.48 లక్షలను తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు.
హైదరాబాద్ సిటీ: తాను సీబీఐ అధికారినని, మీ బ్యాంకు ఖాతాల్లో అక్రమ లావాదేవీలు జరిగాయంటూ సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ఓ ప్రభుత్వ ఉద్యోగిని బోల్తా కొట్టించారు. తాము చెప్పినట్లు వినకుంటే అరెస్ట్ తప్పదంటూ బెదిరించి రూ.48 లక్షలను తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. నగరానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి (55)కి సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు. ‘తాను సీబీఐ అధికారిని. మీ పేరుతో ఢిల్లీ బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు అక్రమ లావాదేవీలు జరిగాయి.
ఈ వార్తను కూడా చదవండి: Revanth Birthday: అదిరిపోయేలా రేవంత్ బర్త్‌డే కానుక.. మీరూ ఓ లుక్కేయండి
దీనిపై మనీలాండరింగ్(Money laundering) కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ తప్పదు. మనీలాండరింగ్ కేసు నమోదైతే ఉద్యోగం పోవడంతోపాటు కుటుంబసభ్యులకూ ఇబ్బందులు వస్తాయి. మీ ఇంటి చుట్టూ సివిల్ దుస్తుల్లో సీబీఐ అధికారులు ఉన్నారు. మేం చెబితే ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారని’ బెదిరించాడు. అదే ఫోన్‌కాల్‌లో ఈడీ అధికారి అంటూ మహిళ రంగప్రవేశం చేసి సదరు ఉద్యోగిని గందరగోళానికి గురిచేయడంతోపాటు ఆదాయం, బ్యాంకు ఖాతాలు, అందులో ఉన్న నగదు వివరాలు సేకరించింది.
గంటగంటకు వీడియోకాల్ చేసి, తమతో కాంటాక్ట్‌లో ఉండాలని సూచించింది. మీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును ఆర్‌బీఐ ఖాతాకు పంపి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని, సుప్రీంకోర్టులో విచారణ తర్వాత మీ డబ్బు తిరిగి పంపుతామని సైబర్ నేరగాళ్లు చెప్పారు. ఇదంతా నిజమేనని నమ్మిన ఆ ఉద్యోగి.. వారు సూచించిన ఖాతాల్లోకి రూ.48 లక్షలు ఆర్‌టీజీఎస్ ద్వారా పంపారు. తర్వాత వారి ఫోన్లు పనిచేయకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశారు.
ఈవార్తను కూడా చదవండి: పశ్చిమ బెంగాల్ నుంచి నగరానికి హెరాయిన్.. ఐటీ కారిడార్‌లో విక్రయం
ఈవార్తను కూడా చదవండి: నీళ్ల బకెట్లో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దివాలా: కిషన్‌రెడ్డి
ఈవార్తను కూడా చదవండి: వద్దొద్దంటున్నా.. మళ్లీ ఆర్‌ఎంసీ!
Read Latest Telangana News and National News
Updated Date - Nov 08 , 2024 | 10:30 AM