ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: దేవుడా.. ఎంతపని చేశావయ్యా.. ఏం జరిగిందంటే..

ABN, Publish Date - Aug 16 , 2024 | 10:23 AM

తినేందుకు ఆహార పదార్థాలను కొనుగోలు చేసేందుకు హాస్టల్‌ నుంచి బయటకు వచ్చిన నిజాం హాస్టల్‌(Nizam Hostel)కు చెందిన ఓ విద్యార్థి కారు ఢీకొనడంతో మృతిచెందాడు. కేసు విచారణలో జాప్యం చేస్తున్నారంటూ విద్యార్థులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు.

- కారు ఢీకొని నిజాం కళాశాల విద్యార్థి మృతి

హైదరాబాద్: తినేందుకు ఆహార పదార్థాలను కొనుగోలు చేసేందుకు హాస్టల్‌ నుంచి బయటకు వచ్చిన నిజాం హాస్టల్‌(Nizam Hostel)కు చెందిన ఓ విద్యార్థి కారు ఢీకొనడంతో మృతిచెందాడు. కేసు విచారణలో జాప్యం చేస్తున్నారంటూ విద్యార్థులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఎస్‌ఐ సురేష్‏రెడ్డి(SI Suresh Reddy) తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్‌ సోమన్‌పల్లి మండలం చిట్యాలకు చెందిన మారపల్లి వంశీ(24) నిజాం కళాశాలలో ఎంఏ చదువుతూ స్థానిక నిజాం కళాశాల హాస్టల్‌(Nizam College Hostel)లో ఉంటున్నాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: తుపాకీతో కాల్చి చంపేస్తా...


బుధవారం రాత్రి తినేందుకు ఏవైనా తీసుకొస్తానని స్నేహితులతో చెప్పి, బయటకు వెళ్లిన వంశీని ఐ10 కారు(ఏపీ28 సీఈ 5654) ఢీకొంది. తలకు, ఛాతీపై తీవ్ర గాయాలకు గురైన వంశీని స్థానిక అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి అర్ధరాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, అతడి స్నేహితులు నిందితులను పట్టుకొని శిక్షించాలని డిమాండ్‌ చేశారు.


ప్రమాదం అనంతరం అక్కడి నుంచి పారిపోయిన కారు డ్రైవర్‌, మరో వ్యక్తి పోలీస్‏స్టేషన్‌లో లొంగిపోయారు. కేసు విచారణలో జాప్యం చేస్తున్నారంటూ విద్యార్థులు, మృతుడి కుటుంబ సభ్యులు సైఫాబాద్‌ పోలీస్‏స్టేషన్‌(Saifabad Police Station) వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రమాదంపై ఫిర్యాదు ఆలస్యంగా అందినా, వెంటనే కేసు నమోదు చేశామని పోలీసులు తెలుపుతున్నారు.


పోలీసులు విద్యార్థులను, విద్యార్థి సంఘాల ప్రతినిధులను శాంతింపజేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గురువారం రాత్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదంపై సీసీ కెమెరాల సహాయంతో విచారిస్తామని ఎస్‌ఐ సురే్‌షరెడ్డి తెలిపారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 16 , 2024 | 10:23 AM

Advertising
Advertising
<