Hyderabad: బంగారు ఆభరణాల చోరీల ముఠా అరెస్ట్..
ABN, Publish Date - Sep 06 , 2024 | 10:04 AM
బంగారు దుకాణాల్లో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న కరుడుకట్టిన ఓ దొంగల ముఠాను జగద్గిరిగుట్ట, బాలానగర్(Jagadgirigutta, Balanagar) సీసీఎస్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఐదుగురు సభ్యులున్న ముఠాలోని నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
హైదరాబాద్: బంగారు దుకాణాల్లో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న కరుడుకట్టిన ఓ దొంగల ముఠాను జగద్గిరిగుట్ట, బాలానగర్(Jagadgirigutta, Balanagar) సీసీఎస్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఐదుగురు సభ్యులున్న ముఠాలోని నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నింధితురాలు పరారీలో ఉన్నారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలానగర్ ఏసీపీ హన్మంతరావు వివరాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లా, గోకరాజుపల్లికి చెందిన బొజ్జగాని జ్ఞానమ్మ(60), ఖమ్మం జిల్లా రాయపట్నానికి చెందిన బొజ్జగాని దీనమ్మ(62), బొజ్జగాని నాగేంద్రమ్మ(70), వెంకటరావమ్మ(50), బాలసాని అశోక్(27), డ్రైవర్ బాలసాని వెంకటపతి అలియాస్ నాని ఒక ముఠాగా ఏర్పడ్డారు.
ఇదికూడా చదవండి: Hyderabad: కేబీఆర్ పార్కు చుట్టూ 6 ఫ్లైఓవర్లు.. 4 సబ్‌వేలు
ఈ ముఠా నగరంలోని పలు ప్రాంతాల్లోని బంగారు దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. ఇద్దరు చొప్పున విడిపోయి షాపులోకి వెళ్లి బంగారం కొనే ముసుగులో నకిలీ బంగారు వస్తువులను షాపులోపెట్టి అసలు బంగారాన్ని దొంగిలించుకుని పారిపోయారు. దీంతో జగద్గిరిగుట్ట ప్రాంతలోని పలు బంగారు షాపుల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీఫుటేజీ ఆధారంగా వీరిపై నిఘా ఏర్పాటు చేశారు. గురువారం బొజ్జగానిదీనమ్మ, నాగేంద్రమ్మ, వెంకటరావమ్మ, బాలసాని అశోక్‌ను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. బొజ్జగాని జ్ఞానమ్మ, వెంకటపతి పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు.
వీరిపై జగద్గిరిగుట్టలో మూడు కేసులు, జీడిమెట్లలో ఒకటి, రాచకొండపరిధిలోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదయ్యాయి. నిందితులను రిమాండ్‌కు తరలించారు. దీనమ్మపై 11, నాగేంద్రమ్మపై 12, వెంకటరమణమ్మపై 12కేసులు వివిధ పోలీస్స్టేషన్ల పరిధుల్లో నమోదు అయినట్టు ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో జగద్గిరిగుట్ట సీఐ కె.క్రాంతికుమార్, డీఐ అంజయ్య, సీసీఎస్ సీఐ పాల్గొన్నారు.
...................................................................................
ఈ వార్తను కూడా చదవండి:
...................................................................................
Hyderabad: ఆన్‌లైన్ షాపింగ్‌తో జర పైలం..
- నకిలీ వెబ్‌సైట్లు సృష్టిస్తున్న సైబర్ కేటుగాళ్లు
హైదరాబాద్ సిటీ: ఈ కామర్స్ సైట్లలో భారీ డిస్కౌంట్‌ల పేరుతో సైబర్ కేటుగాళ్లు కొత్తరకం మోసాలకు తెరతీస్తున్నారు. వినాయక చవితి, దసరా, దీపావళి(Vinayaka Chavithi, Dussehra, Diwali).. వరుస పండుగల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఆన్‌లైన్ షాపింగ్‌ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్‌లకు పెరిగిన అధిక గిరాకీని అవకాశంగా తీసుకుంటున్న కేటుగాళ్లు సైబర్ మోసాలకు తెరతీస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారిని టార్గెట్ చేస్తూ నకిలీ వెబ్‌సైట్లను సృష్టిస్తున్నారు. ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు, శారీస్ తక్కువ ధరకే ఇస్తున్నట్లు ప్రకటనలు గుప్పించి.. పండుగ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ల పేరిట సోషల్‌మీడియా, ఆన్‌లైన్‌లో పోస్టులు పెడుతున్నారు. వెనుకా ముందు చూడకుండా ఆ నకిలీ వెబ్‌సైట్ల లింక్‌లను క్లిక్ చేస్తున్నారు.
ఆర్డర్ బుక్‌చేసి, డబ్బులు చెల్లించిన తర్వాత ఎంతకీ పార్శిల్ చేతికి రాక మోసపోతున్నారు. అనుమానం వచ్చిన కస్టమర్లు అందులో ఉన్న నంబర్‌కు ఫోన్ చేస్తే స్విచాఫ్ చేసి ఉంటాయి. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాలు కొన్ని అయితే.. మరికొన్ని సైబర్ ముఠాలు మాత్రం తిరిగి డబ్బులు చెల్లిస్తామంటూ క్యూఆర్ కోడ్‌లు పంపి కస్టమర్ల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇలా పండుగ ఆఫర్‌ల పేరుతో నకిలీ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు సృష్టిస్తున్న కేటుగాళ్లు అందినంతా దండుకుంటున్నారు.
ప్రతి సైట్‌ను క్లిక్ చేయొద్దు..
ఆన్‌లైన్‌లో కనిపించే ప్రతి ఈ కామర్స్ సైట్‌ను ఓపెన్ చేయొద్దు. నమ్మకమైన ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లనే ఎంచుకోవాలి. సాధ్యమైనంత వరకు క్యాష్ ఆన్ డెలివరీకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో అడగగానే బ్యాంకు ఖాతాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వ్యాలెట్స్ వివరాలు నమోదు చేయొద్దు. ఆ వివరాలన్ని సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్తాయని గుర్తుంచుకోవాలి. ఒక్కసారి డబ్బులు పోగొట్టుకుంటే తర్వాత తిరిగి రావనే విషయాన్ని కస్టమర్లు తెలుసుకోవాలి. - సైబర్ క్రైమ్ పోలీసులు
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News
Updated Date - Sep 06 , 2024 | 10:04 AM