Share News

Hyderabad: పశ్చిమ బెంగాల్‌ నుంచి నగరానికి హెరాయిన్‌.. ఐటీ కారిడార్‌లో విక్రయం

ABN , Publish Date - Nov 07 , 2024 | 12:09 PM

వెస్ట్‌ బెంగాల్‌ నుంచి హైదరాబాద్‌(West Bengal to Hyderabad)కు హెరాయిన్‌ తీసుకొచ్చి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 70 గ్రాముల హెరాయిన్‌(Heroin)ను స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: పశ్చిమ బెంగాల్‌ నుంచి నగరానికి హెరాయిన్‌.. ఐటీ కారిడార్‌లో విక్రయం

- ముగ్గురి అరెస్టు

గచ్చిబౌలి(హైదరాబాద్): వెస్ట్‌ బెంగాల్‌ నుంచి హైదరాబాద్‌(West Bengal to Hyderabad)కు హెరాయిన్‌ తీసుకొచ్చి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 70 గ్రాముల హెరాయిన్‌(Heroin)ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... వెస్ట్‌ బెంగాల్‌(West Bengal)లోని మాల్దా జిల్లాకు చెందిన అజ్మల్‌హుస్సేన్‌(32), నూర్‌ ఆజంఖాన్‌(24)లు కూలీలు. వెస్ట్‌బెంగాల్‌కు చెందిన ఎస్‌కే సురోజ్‌(24) నానక్‌రాంగూడ లేబర్‌కాలనీలో ఉంటూ కూలీ పని చేస్తుంటాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ‘గీతం’ విద్యార్థికి రూ.60 లక్షల వేతనం


అజ్మల్‌ హుస్సేన్‌, ఆజంఖాన్‌లు స్వగ్రామంలో ఓ వ్యక్తి నుంచి 70 గ్రాముల హెరాయిన్‌ను గ్రాము రూ. వెయ్యి చొప్పున కొనుగోలు చేశారు. దానిని నానక్‌రాంగూడలో ఉంటున్న సురోజ్‌కు గ్రాము రూ.5 వేల చొప్పున విక్రయించేందుకు ఈ నెల 4న వెస్ట్‌ బెంగాల్‌ నుంచి నగరానికి వచ్చారు. సురోజ్‌ ఈ హెరాయిన్‌ను నానక్‌రాంగూడతో పాటు ఐటీ కారిడార్‌లోని ఐటీ ఉద్యోగులకు, ఇతరులకు ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకో వాలని పథకం వేశాడు.


city8.jpg

కాగా, ఈ సమాచారం అందుకున్న రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం సాయంత్రం నానక్‌రాంగూడ(Nanakranguda) లేబర్‌ కాలనీలోని ఇంటిపై దాడి చేశారు. అజ్మలు హుస్సేన్‌, ఆజంఖాన్‌, సురోజ్‌లను అదుపులోకి తీసుకున్నారు. రూ.3.5 లక్షల విలువైన 70గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకొని ముగ్గురినీ అరెస్ట్‌ చేశారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: యాదగిరిగుట్ట ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్‌!

ఈవార్తను కూడా చదవండి: కేశవాపురం వద్దు.. మేఘా కాంట్రాక్టు రద్దు

ఈవార్తను కూడా చదవండి: అరుణాచల ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఈవార్తను కూడా చదవండి: తీన్మార్ మల్లన్నకు స్ట్రాంగ్ వార్నింగ్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 07 , 2024 | 12:09 PM