Hyderabad: 10 రోజుల్లో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తాడనుకుంటే..
ABN, Publish Date - Oct 01 , 2024 | 01:01 PM
హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్‌రోడ్డు(Himayatsagar Outer Ring Road) ఎగ్జిట్ 17 వద్ద వేగంగా దూసుకువచ్చిన కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. కారు ముందు అద్దాలు పగిలి, డ్రైవర్ చెట్లపొదల్లో పడి, అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో జరిగింది.
- ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం.. యువ డాక్టర్ దుర్మరణం
- ఎగ్జిట్ 17వద్ద డివైడర్‌ను ఢీకొన్న కారు
- మరో 10 రోజుల్లో ఉన్నత చదువుల కోసం విదేశాలకు..
- స్నేహితులను కలిసి వస్తుండగా ఘటన
- కారులో నుంచి ఎగిరి చెట్లపొదల్లో పడి..
హైదరాబాద్: హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్‌రోడ్డు(Himayatsagar Outer Ring Road) ఎగ్జిట్ 17 వద్ద వేగంగా దూసుకువచ్చిన కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. కారు ముందు అద్దాలు పగిలి, డ్రైవర్ చెట్లపొదల్లో పడి, అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో జరిగింది. బంజరాహిల్స్ రోడ్ నెంబర్ 10(Banjarahills Road No. 10)లో నివాసం ఉండే డాక్టర్ నీలే్‌షరెడ్డి(29) ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో డాక్టర్. మరో 10 రోజుల్లో ఆయన ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లనున్నారు. కాగా, ఆదివారం రాత్రి ఇంట్లో భార్యకు ‘నేను స్నేహితులను కలవడానికి వెళ్తున్నా’ అని చెప్పి తన ఏపీ09 సీజే 1127 కారులో బయలుదేరాడు.
ఇదికూడా చదవండి: MLC: ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి ఎస్కార్ట్ కేటాయింపు..
స్నేహితులను కలిసిన తర్వాతర తిరిగి హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా కారులో ఒక్కడే వస్తున్నాడు. ఎగ్జిట్ 17 వద్ద డివైడర్‌ను కారు వేగంగా ఢీకొనడంతో కారులో నుంచి ఎగిరి చెట్ల పొదల్లో పడి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు నీలే్‌షరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. డాక్టర్ నీలే్‌షరెడ్డి తండ్రి మధుసూదన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసును రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
......................................................................
ఈ వార్తను కూడా చదవండి:
.......................................................................
Hyderabad: యువతిని బ్లాక్‌మెయిల్ చేసిన ఇద్దరు అర్చకుల అరెస్ట్..
హైదరాబాద్: విదేశాల్లో చదువుతున్న ఓ యువతిని లైంగికంగా వేధించి, బ్లాక్‌మెయిల్ చేసిన ఏపీకి చెందిన ఇద్దరు అర్చకులను పోలీసులు అరెస్టు చేశారు. మాసబ్‌ట్యాంక్ పోలీసులు(Massabtank Police) తెలిపిన ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్టానికి చెందిన ఓ అర్చకుడిని మాసబ్ ట్యాంక్ పరిధిలోని ఓ దేవాలయంలో పూజలు నిర్వహించేందుకు స్థానికంగా ఉండే ఓ కుటుంబం పిలిపించింది. ఆ కుటుంబంలోని యువతి అర్చకుడితో స్నేహంగా ఉండేది. యువతికి నెలసరిలో ఇబ్బంది ఉండడంతో సదరు అర్చకుడికి చెప్పింది. నెలసరిలో సమస్య లేకుండా ఉండాలంటే తానిచ్చే ఆయుర్వేదిక్ ముందును వాడాలని ఆమెను నమ్మించాడు.
యువతిని 2020 డిసెంబరు నెలలో మౌలాలీలోని తన గదికి తీసుకెళ్లి మందును తీసుకొని నెలసరి వచ్చే ప్రాంతంలో అప్లై చేయమని చెప్పాడు. యువతి అర్చకుడు చెప్పినట్లు చేసింది. ఆ గదిలో ఫిక్స్ చేసిన కెమెరాలో ఇదంతా రికార్డ్ అయ్యింది. అనంతరం 20 రోజుల తరువాత ఆ యువతిపై చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లిపోయింది. యువతికి సంబంధించినన వీడియోను అర్చకుడు తన సెల్‌ఫోన్ ద్వారా మరో అర్చకుడి సెల్‌ఫోన్‌కుపంపించాడు.
గత నెల 6న మహేష్ పాల్ అనే పేరుతో ఐడీ క్రియేట్ చేసి వీడియోను యువతికి పంపించడంతో ఆమె నిందితుడితో మాట్లాడగా రూ.15 లక్షలు ఇస్తే వీడియో డిలిట్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. యువతి విషయాన్ని తన కుటుంబసభ్యులకు తెలిపింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి ఏపీకి చెందిన ఇద్దరు అర్చకులపై 384, 354(ఏ), 354(సీ), 509 ఆర్‌డబ్ల్యూ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదికూడా చదవండి: హైడ్రాతో నష్టపోయిన పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
ఇదికూడా చదవండి: ఎమ్మెస్సీ నర్సింగ్‌కు ప్రవేశ పరీక్ష నిర్వహించాలి
ఇదికూడా చదవండి: మూసీ పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్... కారణమిదే
ఇదికూడా చదవండి: ఉపఎన్నికపై కడియం శ్రీహరి సంచలన కామెంట్స్
Read Latest Telangana News and National News
Updated Date - Oct 01 , 2024 | 01:01 PM