ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మనీ లాండరింగ్‌ కేసుల పేరుతో భయపెట్టి రూ. 8.30 లక్షలు కాజేశారు..

ABN, Publish Date - Oct 11 , 2024 | 09:44 AM

మీ ఖాతా నుంచి విదేశాలకు డబ్బులు వెళ్లాయని, మీపై మనీ లాండరింగ్‌ కేసులు నమోదయ్యాయని భయపెట్టిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) వృద్ధుడి వద్ద రూ. 8.30 లక్షలు కాజేశారు. రిటైర్డ్‌ ఉద్యోగి(85) సెల్‌ఫోన్‌కు సైబర్‌ నేరగాళ్లు 8284880588 నంబర్‌ నుంచి ఫోన్‌ చేశారు.

- వృద్ధుడి వద్ద రూ. 8.30 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: మీ ఖాతా నుంచి విదేశాలకు డబ్బులు వెళ్లాయని, మీపై మనీ లాండరింగ్‌ కేసులు నమోదయ్యాయని భయపెట్టిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) వృద్ధుడి వద్ద రూ. 8.30 లక్షలు కాజేశారు. రిటైర్డ్‌ ఉద్యోగి(85) సెల్‌ఫోన్‌కు సైబర్‌ నేరగాళ్లు 8284880588 నంబర్‌ నుంచి ఫోన్‌ చేశారు. మీ పేరున ముంబై బ్యాంకులో ఉన్న ఖాతా నుంచి విదేశాలకు పెద్ద మొత్తంలో డబ్బు వెళ్లిందని చెప్పారు. మీపై మనీ లాండరింగ్‌ కేసులు నమోదయ్యాయని భయపెట్టారు. ఈ కేసుల్లో మిమ్మల్ని డిజిటల్‌ అరెస్ట్‌ చేశామని, గది నుంచి బయటకు వెళ్లొద్దని ఆంక్షలు విధించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఉద్యోగాల భర్తీలో దేశానికే తెలంగాణ ఆదర్శం..


స్కైప్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించి వీడియో కాల్‌లో అరెస్ట్‌ వారెంట్‌ చూపించారు. ముంబై క్రైం బ్రాంచ్‌ అధికారులు ఏక్షణంలోనైనా అరెస్ట్‌ చేస్తారని బెదిరించారు. అరెస్ట్‌ను ఆపాలంటే డబ్బులు చెల్లించాలన్నారు. రెండుసార్లు వేర్వేరు ఖాతాల్లో రూ. 8.30 లక్షలు జమచేయించుకున్నారు. వారు మళ్లీ డబ్బు డిమాండ్‌ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


.....................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.....................................................................

Amrapali: ఇంటర్‌ డిప్యూటేషన్‌పై ఆమ్రపాలి ఇక్కడే!

- ఇరు రాష్ట్రాలు అంగీకరిస్తే కొనసాగింపు

- ఈనెల 16లోపు రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశం

హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) ఇక్కడే కొనసాగుతారా? లేదా? అన్న చర్చ అధికార, ఉద్యోగవర్గాల్లో జోరుగా సాగుతోంది. 2010 ఏపీ కేడర్‌కు చెందిన ఆమ్రపాలి తెలంగాణ నివాసంగా పరిగణించి ఇక్కడి కేడర్‌గా గుర్తించాలని కోరగా, ఖండేకర్‌ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఆమె విజ్ఞప్తిని తాజాగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ఈనెల 16లోపు ఏపీలో రిపోర్టు చేయాలని కూడా ఆదేశాలిచ్చింది. కేంద్ర ఆదేశాల నేపథ్యంలో ఆమ్రపాలి ఏపీకి వెళ్లేందుకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే, చివరి అవకాశంగా ఇంటర్‌ డిప్యూటేషన్‌పై తెలంగాణలోనూ నిర్ణీత సమయం పాటు పనిచేసే అవకాశాలున్నాయి. ఇందుకు ఇరురాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం అంగీకరించుకోవాల్సి ఉంటుంది.


పర్మినెంట్‌ అడ్రస్‌ విశాఖగా పేర్కొనడంతో..

ఆమ్రపాలి తన యూపీఎస్సీ అప్లికేషన్‌లో తన పర్మినెంట్‌ అడ్రసుగా విశాఖపట్నంగా పేర్కొనడంతో ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు కేటాయించారు. అయితే తెలంగాణ స్థానికురాలిగా గుర్తించి ఇక్కడి కేడర్‌కు పంపాలని ఆమ్రపాలి విజ్ఞప్తి చేశారు. ఆమె చేసిన పలు విజ్ఞప్తులను పరిశీలించి పలు అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా తప్పుకొని ఏపీకి వెళ్తారా? లేదా ఇంటర్‌ డిప్యూటేషన్‌పై కొనసాగే అవకాశాన్ని వినియోగించుకుంటారా? అన్న చర్చ మొదలైంది.


ఇదికూడా చదవండి: Hydra: బెంగళూరు చెరువులు బాగుపడిందెలా?

ఇదికూడా చదవండి: Yadagirigutta: దసరా నుంచి స్వర్ణతాపడం పనులు

ఇదికూడా చదవండి: Hyderabad: అది పరిహారం కాదు.. పరిహాసం: కేటీఆర్‌

ఇదికూడా చదవండి: Manda krishna: వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వాలి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 11 , 2024 | 09:44 AM