ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: అరబ్‌ దేశాల్లో ఉద్యోగాలంటూ గాలం..

ABN, Publish Date - Jul 10 , 2024 | 10:07 AM

అరబ్‌ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి నిరుద్యోగులను బురిడీ కొట్టించి రూ.లక్షల్లో కొల్లగొడుతున్న ఢిల్లీకి చెందిన సైబర్‌ క్రిమినల్‌(Cyber ​​criminal)ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

- లక్షలు దోచేస్తున్న సైబర్‌ దొంగ అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: అరబ్‌ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి నిరుద్యోగులను బురిడీ కొట్టించి రూ.లక్షల్లో కొల్లగొడుతున్న ఢిల్లీకి చెందిన సైబర్‌ క్రిమినల్‌(Cyber ​​criminal)ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని నుంచి 6 ల్యాప్‌టాప్‏లు, 6 మొబైల్స్‌, 5 బీటెల్‌ వైర్‌లెస్‌ ఫోన్లు, 5 డెబిట్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. సైబర్‌ క్రైమ్‌ డీసీపీ కవిత(Cybercrime DCP Kavita) తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన యువకునికి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి సౌదీ అరేబియాలోని జెనాన్‌ యూనివర్సిటీలో మీరు ఉద్యోగానికి ఎంపికయ్యారని చెప్పారు. వెళ్లడానికి ఇంట్రెస్టు ఉన్నట్లయితే వెంటనే రిజిస్ట్రేషన్‌ ఫీజు, ప్రాసెసింగ్‌ ఫీజు, వీసా ఫీజు, జీఎస్టీ చెల్లించాలంటూ విడతల వారీగా రూ.4.71లక్షలు దోచేశారు.

ఇదికూడా చదవండి: Hyderabad: జల్సాలకు అలవాటుపడి.. చోరీల బాట ఎంచుకుని..


ఎంతకీ ఉద్యోగానికి సంబంధించి వివరాలు పంపకపోవడంతో బాధితుడు వారిని నిలదీశాడు. దీంతో అవతలివైపు వ్యక్తులు స్పందించడం మానేశారు. మోసపోయానని భావించిన బాధితుడు సిటీ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్‌ బోస్‌ కిరణ్‌ తన బృందంతో టెక్నికల్‌ ఎవిడెన్స్‌ సేకరించి ఢిల్లీకి చెందిన నిషాంత్‌కుమార్‌రాయ్‌ని నిందితుడిగా గుర్తించి అరెస్ట్‌ చేశారు. నిందితుడు ఒక కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసి నలుగురు టెలీకాలర్స్‌తో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని సైబర్‌క్రైమ్‌లకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 10 , 2024 | 10:09 AM

Advertising
Advertising
<