ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఆకలై.. ఆహారం దొరకక.. అమ్మవారి విగ్రహం ధ్వంసం

ABN, Publish Date - Oct 12 , 2024 | 10:53 AM

ఆకలి కావడంతో ఆహారం దొరకక మానసికస్థితి సరిగ్గా లే ని ఓ వ్యక్తి నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం(Nampally Exhibition Ground)లోని దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. అక్కడ ఉన్న సామగ్రిని చిందరవందర చేశాడు.

- మానసిక రోగిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

హైదరాబాద్: ఆకలి కావడంతో ఆహారం దొరకక మానసికస్థితి సరిగ్గా లే ని ఓ వ్యక్తి నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం(Nampally Exhibition Ground)లోని దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. అక్కడ ఉన్న సామగ్రిని చిందరవందర చేశాడు. డీసీపీ అక్షాంత్‌ యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూలుకు చెందిన కృష్ణయ్యగౌడ్‌కు మానసికస్థితి సరిగ్గా లేకపోవడంతో నాంపల్లి పరిసరాల్లో ఉంటూ భిక్షాటన చేసుకుంటున్నాడు. గురువారం రాత్రి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు జరగగా.. కృష్ణయ్యగౌడ్‌ తెల్లవారుజాము వరకు అక్కడే ఉన్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: సొంతిల్లు కావాలంటే.. ఇలా చేయండి చాలు..


రాత్రి 3 నుంచి 4 గంటల సమయంలో ఆకలికావడంతో ఏదైనా ఆహారం దొరుకుతుందని అమ్మవారి మండపంలోకి వెళ్లాడు. ప్రసాదం లభించకపోవడంతో మండపాన్ని చిందరవందర చేసి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి సీసీ ఫుటేజీల ఆధారంగా శుక్రవారం రాత్రి ఫీల్‌ఖానా చౌరస్తా వద్ద నిందితుడిని అరెస్ట్‌ చేశారు. అంతకుముందు బీజేపీ నాయకురాలు మాధవీలత, సినీనటి కరాటే కళ్యాణి, తెలంగాణ భజరంగ్‌ సేన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు తదితరులు విగ్రహం ఎదుట కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.


........................................................

ఈ వార్తను కూడా చదవండి:

........................................................

Hyderabad: నమ్మకంతో సవాళ్లను ఎదుర్కోవాలి: క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌

హైదరాబాద్‌ సిటీ: క్యాన్సర్‌తో పోరాడడంలో ధైర్యమే గొప్ప ఆయుధమని, నమ్మకంతో సవాళ్లను ఎదుర్కోవాలని భారత క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌(Indian cricketer Mohammad Siraj) పేర్కొన్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారులను శుక్రవారం బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో ఆస్పత్రిలో పరామర్శించి వారితో కాసేపు గడిపారు. క్రికెట్‌ మ్యాచ్‌లో క్యాచ్‌ను వదులుకోవడం వల్ల కొన్నిసార్లు ఆటకు నష్టం వాటిల్లుతుదని, అలాగే జీవితంలో ఆత్మవిశ్వాసం, భావోద్వేగ సమతుల్యతను కోల్పోవడం క్యాన్సర్‌ వంటి సవాళ్లపై వ్యతిరేక ప్రభావం చూపిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ దినేశ్‌కుమార్‌ , డాక్టర్‌ ఫైసల్‌ బి నహ్ది, డాక్టర్‌ శిరీషారాణి, డాక్టర్‌ లోకేష్‌ లింగప్ప, డాక్టర్‌ ప్రశాంత్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు


ఇదికూడా చదవండి: Kishan Reddy: దమ్ముంటే.. ‘మూసీ దర్బార్‌’ పెట్టాలి

ఇదికూడా చదవండి: Gaddar: తూప్రాన్‌ లిఫ్టు ఇరిగేషన్‌కు గద్దర్‌ పేరు

ఇదికూడా చదవండి: సురేఖ అంశంపై అధిష్ఠానం వివరణ కోరలేదు

ఇదికూడా చదవండి: Uttam: డిసెంబరులో ఎన్డీఎస్‌ఏ తుది నివేదిక!?

Read Latest Telangana News and National News

Updated Date - Oct 12 , 2024 | 10:53 AM