ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: సల్ఫర్‌, రంగులతో టీపొడి తయారీ..

ABN, Publish Date - Dec 24 , 2024 | 01:59 PM

రంగులు, సల్ఫర్‌, ఇతర పదార్థాలు ఉపయోగించి, నకిలీ టీపొడి తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని సౌత్‌వెస్ట్ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, ఫుడ్‌సేఫ్టీ అధికారులు అరెస్ట్‌ చేశారు.

- పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

- రూ.1.20 లక్షల విలువైన నకిలీ టీపొడి స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: రంగులు, సల్ఫర్‌, ఇతర పదార్థాలు ఉపయోగించి, నకిలీ టీపొడి తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని సౌత్‌వెస్ట్ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, ఫుడ్‌సేఫ్టీ అధికారులు అరెస్ట్‌ చేశారు. చందానగర్‌(Chandanagar)కు చెందిన డి.చంద్రశేఖర్‌(46) ఎలాంటి అనుమతులు లేకుండా, ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ నిబంధనలు పాటించకుండా టీపొడి తయారు చేసి, నగరంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: DK Aruna: అల్లు అర్జున్‌పై వేధింపులకు కారణం అదే.. డీకే అరుణ సంచలన కామెంట్స్


ఇడకోల్‌ సన్‌సెట్‌ ఎల్లోకలర్‌, నీల్‌కియాన్‌ కలర్‌, కాడమన్‌ షుగర్‌ ఫ్లేవర్‌లు కలిపి నకిలీ టీపొడి తయారు చేసి, మెహిదీపట్నం, గోల్కొండ, టౌలిచౌకి, కూకట్‌పల్లి(Mehidipatnam, Golconda, Touli Chowki, Kukatpally), గచ్చిబౌలి, తెల్లాపూర్‌, పటాన్‌చెరు, లింగంపల్లి, చందానగర్‌ పరిసర ప్రాంతాల్లో దుకాణాలకు సరఫరా చేస్తున్నాడు.


ఈ దందాపై పక్కా సమాచారమందుకున్న సౌత్‌వెస్టు జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, జీహెచ్‌ఎంసీ ఫుడ్‌సేఫ్టీ అధికారులు చందానగర్‌లోని చంద్రశేఖర్‌ కార్ఖానాపై దాడి చేశారు. అతడి వద్ద నుంచి రూ.1.20 లక్షల విలువైన 44 కిలోల టీపొడి, 500 గ్రాముల రంగు, 500 గ్రాముల నికొలాన్‌ కలర్‌, 12 బాటిళ్ల కార్‌మాన్‌ షుగర్‌ ఫ్లేవర్‌లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని చందానగర్‌ పోలీసులకు అప్పగించారు.


ఈవార్తను కూడా చదవండి: Revanth Reddy: సంక్రాంతికి వస్తున్నాం!

ఈవార్తను కూడా చదవండి: మహిళా గ్రూపులతో 231 ఎకరాల్లో సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయించండి: సీఎస్‌

ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: విచారణకు రండి..

ఈవార్తను కూడా చదవండి: Cybercrime: బరితెగించిన సైబర్‌ నేరగాళ్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 24 , 2024 | 01:59 PM