ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: జీహెచ్‌ఎంసీ అధికారులను బెదిరించిన ఎమ్మెల్సీ

ABN, Publish Date - Nov 27 , 2024 | 08:10 AM

అపరిశుభ్రంగా ఉన్న రెండు చికెన్‌ దుకాణాలను సీజ్‌ చేసేందుకు వెళ్లిన అధికారులను ఓ ఎమ్మెల్సీ(MLC), కొందరు స్థానికులు బెదిరించారని పోలీసులకు జీహెచ్‌ఎంసీ(GHMC) ఫిర్యాదు చేసింది. అధికారులు స్వాధీనం చేసుకున్న పదార్థాలను స్థానికులు బలవంతంగా తీసుకుపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

- విధులకు ఆటంకం కలిగించారని పోలీసులకు ఫిర్యాదు

- అపరిశుభ్ర చికెన్‌ దుకాణాలు సీజ్‌ చేసేందుకు వెళ్లిన బల్దియా బృందం

హైదరాబాద్‌ సిటీ: అపరిశుభ్రంగా ఉన్న రెండు చికెన్‌ దుకాణాలను సీజ్‌ చేసేందుకు వెళ్లిన అధికారులను ఓ ఎమ్మెల్సీ(MLC), కొందరు స్థానికులు బెదిరించారని పోలీసులకు జీహెచ్‌ఎంసీ(GHMC) ఫిర్యాదు చేసింది. అధికారులు స్వాధీనం చేసుకున్న పదార్థాలను స్థానికులు బలవంతంగా తీసుకుపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 22న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పరిశీలనకు వెళ్లిన మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి.. స్థానికుల ఫిర్యాదు మేరకు చాదర్‌ఘాట్‌ ఆజాద్‌ మార్కెట్‌(Chadarghat Azad Market)లోని రెండు చికెన్‌ షాపులను తనిఖీ చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మోసం చేశాడని యువతి ఫిర్యాదు.. సినీనటుడిపై కేసు


అత్యంత దుర్గంధ పూరితంగా ఉండడంతో పాటు ఎలుకలు తిరుగుతోన్న ఆ దుకాణాలను మూసి వేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో డీఎంసీ, ఏఎంఓహెచ్‌, వెటర్నరీ అధికారుల బృందం ప్రజారోగ్య నిబంధనలను ఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేసి.. దుకాణాలు ఖాళీ చేయాలని సూచించింది. అయితే, నోటీసులు తీసుకునేందుకు యజమానులు నిరాకరించడంతో అక్కడి గోడలకు అంటించారు. రిజిస్టర్డ్‌ పోస్టులోనూ దుకాణాల చిరునామాకు నోటీసులు పంపినట్టు అధికారులు తెలిపారు.


దుకాణాల్లో 1600లకుపైగా బ్రాయిలర్‌ పక్షులు, 30 కిలోల డ్రెస్‌డ్‌ చికెన్‌, 7 కిలోల లివర్‌ గుర్తించారు. బ్రాయిలర్‌ పక్షులను రెండు గంటల్లో అక్కడి నుంచి తరలించాలని దుకాణదారులకు సూచించిన అధికారులు చికెన్‌, లివర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో ఓ ఎమ్మెల్సీ, వార్డు మెంబర్లు అక్కడకు వచ్చి అధికారులు బెదిరించారని, విధులకు ఆటంకం కలిగించారని కాచిగూడ(Kachiguda) పోలీసులకు వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్‌ ఫిర్యాదు చేశారు.


దీనిపై మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి స్పందిస్తూ అనారోగ్యకర పదార్థాలు విక్రయిస్తోన్న వారిపై చర్యలు తీసుకోవడాన్ని స్వాగతించకుండా బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులు అడ్డుకునే ప్రయత్నం చేయడం సబబు కాదని పేర్కొన్నారు. ఎంఐఎం ఎమ్మెల్సీ, వార్డు మెంబర్లుగా చెప్పుకునే స్థానికులు కొందరు అధికారులను బెదిరించగా.. వారి పేర్లు ప్రస్తావించకుండా గుర్తు తెలియని వ్యక్తులని జీహెచ్‌ఎంసీ అధికారులు ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.


ఈవార్తను కూడా చదవండి: ఎముకలు కొరికే చలి

ఈవార్తను కూడా చదవండి: అమ్మకానికి చిన్నారుల అశ్లీల వీడియోలు!

ఈవార్తను కూడా చదవండి: హోటళ్లు, రెస్టారెంట్లపై 556 కేసులు

ఈవార్తను కూడా చదవండి: రేవంత్.. నీ పౌరుషం ఏమైంది.. BRS అవినీతిపై కేసులేవీ..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 27 , 2024 | 08:10 AM