ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: పేరుమోసిన రౌడీషీటర్లు అరెస్ట్‌

ABN, Publish Date - Oct 24 , 2024 | 08:43 AM

కొంతకాలంగా పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలో ఉన్న పేరు మోసిన ఇద్దరు రౌడీషీటర్ల ఆటకట్టించారు సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు(Southzone Task Force Police) బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- పక్కా సమాచారంతో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ: కొంతకాలంగా పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలో ఉన్న పేరు మోసిన ఇద్దరు రౌడీషీటర్ల ఆటకట్టించారు సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు(Southzone Task Force Police) బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీపీ అందె శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం..

ఈ వార్తను కూడా చదవండి: Trains cancelled: ‘దానా‘ తుఫాన్‌ ఎఫెక్ట్‌.. మరో 17 రైళ్లు రద్దు


- వయసు-54.. క్రిమినల్‌ కేసులు- 72

శాలిబండ పోలీస్‌స్టేషన్‌ పరిధికి చెందిన ఆయూబ్‌ఖాన్‌ అలియాస్‌ ఆయూబ్‌ అలియాస్‌ పఠాన్‌ పేరుమోసిన రౌడీషీటర్‌. ఇతడి వయసు 54 సంవత్సరాలు. ఇప్పటి వరకు నమోదైన క్రిమినల్‌ కేసుల సంఖ్య 72. సైబరాబాద్‌, హైదరాబాద్‌, రాచకొండ పరిధిలో 14 మర్డర్‌ కేసులు, 14 హత్యాయత్నం కేసులు సహా.. భూ కబ్జాలు, దోపిడీలు, అక్రమ ఆయుధాలు వంటి కేసులు నమోదై ఉన్నాయి. వీటిలో చాలా కేసులు న్యాయస్థానంలో ట్రయల్స్‌లో ఉండగా.. నిందితుడు కోర్టుకు హాజరుకాకుండా పోలీసుల కళ్లుగప్పి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.


దీంతో కామాటిపురా పోలీస్‌స్టేషన్‌కు చెందిన కేసులో నాంపల్లి న్యాయస్థానం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌(ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర టీమ్‌, కామాటిపురా పోలీసులతో కలిసి టెక్నికల్‌ ఎవిడెన్స్‌, ఇతర సైంటిఫిక్‌ ఆధారాల ద్వారా నిఘా పెట్టి నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.


- వయసు- 40, క్రిమినల్‌ కేసులు-44

కాలాపత్తర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిఽధికి చెందిన మహ్మద్‌ అశ్వాక్‌ పేరుమోసిన రౌడీషీటర్‌. ఇతడి వయసు-40 సంవత్సరాలు. నమోదైన క్రిమినల్‌ కేసుల సంఖ్య 44. సైబరాబాద్‌, హైదరాబాద్‌, రాచకొండ పరిధిలో 2 మర్డర్‌ కేసులు, 6 హత్యాయత్నం కేసులు సహా.. ఆస్తి, భౌతికదాడుల కేసులు ఉన్నాయి. 24 ఏళ్లుగా నేరాలు చేస్తున్నారు. కాలాపత్తర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కేసుల్లో పరారీలో ఉన్నాడు. న్యాయస్థానానికి హాజరుకాకపోవడంతో సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర టీమ్‌ రంగంలోకి దిగి నిఘా పెట్టి నిందితుడిని పట్టుకున్నారు. బుధవారం కాలాపత్తర్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


ఇదికూడా చదవండి: చెప్పినట్లుగానే దరణిని మారుస్తున్నాం: మంత్రి పొంగులేటి

ఇదికూడా చదవండి: తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలనూ తిరుమలలో అనుమతించాలి

ఇదికూడా చదవండి: KTR: రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు

ఇదికూడా చదవండి: Bandi Sanjay: భయపెట్టాలని చూస్తే భయపడతామా?

Read Latest Telangana News and National News

Updated Date - Oct 24 , 2024 | 08:43 AM