Hyderabad: కాలేజీ నుంచి ఇంటికెళ్తుండగా..
ABN, Publish Date - Aug 22 , 2024 | 10:48 AM
కుమార్తెను కాలేజీ నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా మృత్యురూపంలో వచ్చిన డీసీఎం(DCM) వారి స్కూటర్‌ను ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే కూతురు మృతిచెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తండ్రి కన్నుమూశాడు.
- స్కూటర్‌ను ఢీకొట్టిన డీసీఎం
- తండ్రీకూతుళ్లు దుర్మరణం
హైదరాబాద్: కుమార్తెను కాలేజీ నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా మృత్యురూపంలో వచ్చిన డీసీఎం(DCM) వారి స్కూటర్‌ను ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే కూతురు మృతిచెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తండ్రి కన్నుమూశాడు. కుల్సుంపురా పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. జియాగూడకు చెందిన ఎండీ బాబుమియా(MD Babumia) కూతురు నౌషీన్(19) హుస్సేనీఆలం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఫస్టియర్ చదువుతోంది. బుధవారం కాలేజీ ముగిసిన అనంతరం స్కూటర్‌పై కూతురును జియాగూడలోని ఇంటికి తీసుకెళ్తుండగా 100 ఫీట్ల రోడ్డు వద్ద వేగంగా వచ్చిన డీసీఎం వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన నౌషీన్ అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, ఉస్మానియా ఆస్పత్రిలో బాబుమియా మృతిచెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరో ఘటనలో బాలుడు..
వినాయక విగ్రహాలను చూసేందుకు వచ్చిన బాలుడిని కారు ఢీకొట్టడంతో ప్రాణాలు వదిలాడు. హయత్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం.. కర్మన్‌ఘాట్‌కు చెందిన చిట్టిగొరి గోవర్ధన్‌రావు కుమారుడు జశ్వంత్ (14) స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి హయత్‌నగర్ హైకోర్టు కాలనీ వద్ద జాతీయ రహదారి పక్కన తయారు చేస్తున్న వినాయక విగ్రహాలను చూడడానికి వచ్చాడు. డివైడర్ ఎక్కి రోడ్డు దాటుతుండగా హయత్‌నగర్ వైపు నుంచి దిల్‌సుఖ్‌నగర్ వైపు వేగంగా వెళుతున్న కారు జశ్వంత్‌ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన బాలుడిని సమీపంలోని పైవ్రేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు.
.......................................................................
ఈ వార్తను కూడా చదవండి:
...........................................................................
Hyderabad: పిడుగుల నుంచి కాపాడుకుందాం...
- ‘లైట్‌నింగ్ అరెస్టర్’తో భవనాలకు రక్షణ
- వాతావరణశాఖ శాస్త్రవేత్త ధర్మరాజు
హైదరాబాద్ సిటీ: నగరంలో కొద్దిరోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. అప్పటివరకు ఎండ ఉంటుండగా, కాసేపట్లో భారీ వర్షం (Heavy rain) పడుతోంది. ఒక్క ఉదుటన భారీ ఉరుములు, పిడుగులతో ప్రజలు బెంబేలవుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున పంజాగుట్ట కాలనీ సుక్‌నివాస్ అపార్ట్‌మెంట్ రెయిలింగ్, కారు షెడ్డుపై పడిన పిడుగు శబ్థం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. అంజయ్యనగర్‌లో ఓ ఇంటి పిట్టగోడపై పిడుగు పడి గోడ కూలింది.
భవనాలకు రక్షణ కవచం
నగరంలో బహుళ అంతస్థుల భవనాలపై ‘లైట్‌నింగ్ అరెస్టర్’ పరికరం ఏర్పాటు చేసుకుంటే పిడుగుల బారి నుంచి తప్పించుకోవచ్చని బేగంపేట వాతావరణ శాఖ శాస్త్రవేత్త ధర్మరాజు తెలిపారు. భవనాల పైభాగంలో లైట్‌నింగ్ అరెస్టర్ యాంటీనా పరికరాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇది మెరుపు మార్గాన్ని మళ్లిస్తుంది, పిడుగు తీవ్రత తగ్గిస్తుందని చెప్పారు. వానాకాలంలో సాధారణంగా క్యుములోనింబస్, నింబోస్టాటస్ మేఘాలతో వర్షాలు అధికంగా కురుస్తాయని, ఇందులో క్యుములోనింబస్ మేఘాలు అత్యంత శక్తివంతమైనవని పేర్కొన్నారు.
క్యుములోనింబ్‌సతో కుండపోత
క్యుములోనింబస్(Cumulonimbus) మేఘాలతో తక్కువ సమయంలో కుండపోత వర్షం కురుస్తోంది. ఈ మేఘాలు విస్తీర్ణం 1 నుంచి 16 కి.మీ. పరిధిలో ఉంటుంది. క్యుములోనింబస్ మేఘాలతో నల్లటి మబ్బులు దట్టంగా కమ్ముకురావడంతో ఒక్కసారిగా కుండపోతగా కురిసి లోతట్టు ప్రాంతాలు నీటమునుగుతున్నాయి.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News
Updated Date - Aug 22 , 2024 | 10:51 AM