Hyderabad: పార్ట్‌టైం జాబ్ ఆఫర్.. రూ. 21.78 లక్షలు గాయబ్
ABN, Publish Date - Jun 22 , 2024 | 10:16 AM
ఇంట్లోనే కూర్చొని పార్ట్ టైమ్ ఉద్యోగం(Part time job)తో డబ్బులు సంపాదించొచ్చు అని గుర్తుతెలియని వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మింది. వారు చెప్పినట్లు చేసి ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 21.78 లక్షలు పోగొట్టుకుంది.
- మహిళను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు
హైదరాబాద్ సిటీ: ఇంట్లోనే కూర్చొని పార్ట్ టైమ్ ఉద్యోగం(Part time job)తో డబ్బులు సంపాదించొచ్చు అని గుర్తుతెలియని వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మింది. వారు చెప్పినట్లు చేసి ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 21.78 లక్షలు పోగొట్టుకుంది. మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్(Cybercrime) పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ మహిళకు ఇటీవల టెలిగ్రామ్‌లో ఒక మెసేజ్ వచ్చింది. ‘కేవలం స్టార్ హోటళ్లకు సంబంధించిన వీడియోలు చూసి, మంచి కామెంట్లు పెట్టి ఫైవ్‌స్టార్ రేటింగ్ ఇస్తే చాలు. వాటిని స్ర్కీన్ షాట్ తీసి పంపితే ప్రతి క్లిప్పింగ్‌కు రూ.50 ఇస్తాం. అలా రోజుకు రెండు నుంచి మూడు వేలు సంపాదించొచ్చు’ అంటూ లింక్‌ను పంపారు. ప్రతి ఒక్కరూ దీన్ని పార్ట్‌టైమ్ ఉద్యోగంగా చేసుకోవచ్చు అని నమ్మించారు. ఆ మహిళ వారు పంపిన లింక్‌ను ఓపెన్ చేసి వివరాలు నమోదు చేసి, పేరు రిజిస్టర్ చేయించుకుంది. వారు చెప్పినట్లు చేసింది. మొదట్లో డబ్బులు ఇచ్చిన కేటుగాళ్లు పూర్తిగా నమ్మించారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మాట్లాడుకుందామని పిలిచి.. సోదరులపై కత్తులతో దాడి.. ఒకరి మృతి
ఆ తర్వాత లైన్‌లోకి వచ్చి ఆన్‌లైన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అతితక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు పొందచ్చని, అది కేవలం కొద్దిమందికే పరిమితం అని నమ్మించారు. ప్రారంభంలో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టించారు. ఆ డబ్బును వేరేచోట ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లు చూపించి భారీ లాభాలు వచ్చినట్లు వర్చువల్‌గా చూపించారు. అలా మెల్లగా ముగ్గులోకి దింపి, విడతలవారీగా రూ. 21.78 లక్షలు కొల్లగొట్టారు. డబ్బులు తీసుకోవడం తప్ప.. ఎంతకీ తిరిగి ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన ఆ మహిళ నిలదీసింది. దాంతో అవతలి వ్యక్తులు స్పందించడం మానేసి కాంటాక్టు కట్ చేశారు. మోసపోయినట్లు గుర్తించిన మహిళ లబోదిబో అంటూ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 22 , 2024 | 10:16 AM