Hyderabad: ఏపీకే ఫైల్ రూపంలో క్యూఆర్ కోడ్ మోసాలు..
ABN, Publish Date - Dec 10 , 2024 | 11:12 AM
సిటీ: రోజుకో కొత్తరకం మోసాలతో బురిడీ కొట్టిస్తున్న సైబర్ క్రిమినల్స్(Cyber criminals) మళ్లీ పాత పద్ధతిని తెరపైకి తెస్తున్నారు. ఐదేళ్ల క్రితం నాటి క్యూఆర్ కోడ్ సైబర్ మోసాలను సరికొత్తగా అమలుచేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.
- రూ. లక్షలు కొల్లగొడుతున్న సైబర్ క్రిమినల్స్
హైదరాబాద్ సిటీ: రోజుకో కొత్తరకం మోసాలతో బురిడీ కొట్టిస్తున్న సైబర్ క్రిమినల్స్(Cyber criminals) మళ్లీ పాత పద్ధతిని తెరపైకి తెస్తున్నారు. ఐదేళ్ల క్రితం నాటి క్యూఆర్ కోడ్ సైబర్ మోసాలను సరికొత్తగా అమలుచేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో ఓఎల్‌ఎక్స్‌లో పెట్టిన వస్తువులను కొనుగోలు చేస్తామంటూ ఫోన్లు చేస్తూ క్యూఆర్ కోడ్(QR code)తో మోసాలకు పాల్పడేవారు. కొన్నాళ్ల వరకు ఆ తరహా మోసాలు చేశారు. క్రమంగా సరికొత్త మోసాలకు తెరతీయడంతో క్యూ ఆర్ కోడ్ మోసాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం వాటికి కొత్త రంగు పులుముతూ మళ్లీ క్యూఆర్ కోడ్ మోసాలకు పాల్పడుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: KTR: రాహుల్‌ను అనుసరించాం తప్పేమిటి.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనలు..
కొరియర్ సర్వీసుల పేరుతో కేటుగాళ్లు సరికొత్త మోసాలకు తెరతీశారు. నగరానికి చెందిన 67 ఏళ్ల వృద్ధునికి ఫ్లిప్‌కార్టు పార్శిల్ వచ్చింది. కొరియర్ బాయ్ ప్రవర్తన నచ్చకపోవడంతో ఆగ్రహించిన బాధితుడు కొరియర్ సర్వీ్‌సకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. మీ ఫిర్యాదు స్వీకరించాలంటే ముందుగా రూ. 10 చెల్లించాలని నమ్మించిన నిందితులు ఏపీకే ఫైల్ (ఆండ్రాయిడ్ ప్యాకేజి కిట్) రూపంలో క్యూఆర్ కోడ్ లింకును పంపాడు. బాధితుడు ఆ లింక్‌ను ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా రూ. 10 చెల్లించడానికి ప్రయత్నించాడు. అయితే, అప్పటికే ఫోన్ హ్యాక్ చేసిన క్రిమినల్స్ అతని ఖాతా నుంచి మొత్తం రూ. 4 లక్షల 68 వేల 690 కొల్లగొట్టారు.
రూ.1 చెల్లించాలని రూ.1.23 లక్షలకు టెండర్
నగరంలో మతపరమైన పాఠశాల నడుపుతున్న వ్యక్తికి కర్ణాటక నుంచి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. మతపరమైన పాఠశాలలు నడపడానికి భవన నిర్మాణం చేస్తున్నామని, కన్‌స్ట్రక్షన్‌కు సహకరించేలా మీరు ఏదైనా సహాయం చేయాలని కోరాడు. అందుకు బాధితుడు అంగీకరించడంతో ముందుగా గూగుల్‌పే ట్రాన్సాక్షన్ సులభతరం చేయడానికి ముందుగా ఒక్క రూపాయి పంపాలని క్యూఆర్ కోడ్‌ను పంపాడు.
ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఒక్కరూపాయి పంపిన తర్వాత అవతలి వ్యక్తి చెప్పిన విధంగా ప్రాసెస్ చేసిన బాధితుడు డబ్బులు బదిలీ చేశాడు. కానీ, అతని ఖాతా నుంచి రూ.1.12లక్షలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. కంగుతిన్న అతను ఫోన్ చేయగా.. మీ డబ్బులు తిరిగి మీ ఖాతాలోకి జమ చేస్తాను కానీ.. రూ.11వేలు గూగుల్‌పే ద్వారా చెల్లించాలని కోరాడు. అందుకు ఒప్పుకొన్న బాధితుడు వాటిని బదిలీ చేశాడు. ఆ తర్వాత నిందితుడు ఫోన్ స్విచాఫ్ చేశాడు. దాంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అప్రమత్తంగా ఉండాలి..
సైబర్ నేరాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరాలను అరికట్టాలంటే అవగాహనకు మించిన ఆయుధం లేదు. ఎప్పటికప్పుడు సైబర్ క్రిమినల్స్ కొత్తకొత్త పంథాలను ఎంచుకొని మోసాలకు పాల్పడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అనుమానం వస్తే మోసపోవడం కన్నా ముందే టోల్ ఫ్రీ నంబర్ 1930 లేదా సైబర్ క్రైమ్ వాట్సాప్ నంబర్ 8712665171కు కాల్ చేయొచ్చు.
- ధార కవిత, డీసీపీ, సిటీ సైబర్‌క్రైమ్
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మూసీ నిర్వాసితులకు రూ. 2 లక్షలు
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆశ వర్కర్లపై పోలీసుల దాష్టీకం
ఈవార్తను కూడా చదవండి: Sangareddy: సోనియా,రాహుల్ ఇచ్చిన మాట తప్పరు
ఈవార్తను కూడా చదవండి: మోహన్‌బాబు యూనివర్సిటీలో జర్నలిస్టులపై బౌన్సర్ల దాడి
Read Latest Telangana News and National News
Updated Date - Dec 10 , 2024 | 11:13 AM