Hyderabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నగర యువకుడి మృతి
ABN, Publish Date - Nov 20 , 2024 | 07:52 AM
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు మృతిచెందాడు. సందీప్ కుమార్‌యాదవ్ (21) రెండేళ్ల క్రితం ఎమ్మెస్ చేయడానికి అమెరికాలోని ఒహాయో వెళ్లాడు. అయితే.. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంతో సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు.
హైదరాబాద్ సిటీ: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్(Hyderabad)కు చెందిన యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగాల్ రాష్ట్రానికి చెందిన రాం అశీష్(Ram Ashish) కుటుంబం కుత్బుల్లాపూర్(Qutubullapur) డివిజన్‌లోని పద్మానగర్ ఫేజ్-2లో నివసిస్తోంది. రాం అశీష్‌కు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు సందీప్ కుమార్‌యాదవ్ (21) రెండేళ్ల క్రితం ఎమ్మెస్ చేయడానికి అమెరికా(America)లోని ఒహాయో వెళ్లాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఒరిగిన ఐదు అంతస్తుల భవనం
ఈ నెల 17వ తేదీ రాత్రి స్నేహితుడితో కలిసి మరో స్నేహితుడిని కలిసేందుకు కారులో వెళ్తున్నాడు. వేగంగా వచ్చిన మరో కారు వారి కారును ఢీకొట్టడంతో సందీప్(Sandeep) అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి స్నేహితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కుమారుడి మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు.
ఈవార్తను కూడా చదవండి: శబరిమలకు 18 ప్రత్యేక రైళ్లు
ఈవార్తను కూడా చదవండి: చేసింది చెప్పలేక కేసీఆర్‌ను తిడతావా..
ఈవార్తను కూడా చదవండి: మళ్లీ పుంజుకున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
ఈవార్తను కూడా చదవండి: సగం పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాల్లేవు
Read Latest Telangana News and National News
Updated Date - Nov 20 , 2024 | 08:16 AM