Hyderabad: దొంగపోలీస్ అరెస్ట్.. దొంగనోట్ల చెకింగ్ అంటూ బెదిరించి దారిదోపిడీలు
ABN, Publish Date - Aug 17 , 2024 | 11:41 AM
పోలీస్‌గా చెప్పుకొని బెదిరిస్తూ దారిదోపిడీలకు పాల్పడుతున్న ఓ అంతరరాష్ట్ర దొంగను సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు(City Task Force Police) అరెస్ట్ చేశారు.
- కటకటాల్లోకి ఇరాన్ గ్యాంగ్ ముఠా సభ్యుడు
హైదరాబాద్ సిటీ: పోలీస్‌గా చెప్పుకొని బెదిరిస్తూ దారిదోపిడీలకు పాల్పడుతున్న ఓ అంతరరాష్ట్ర దొంగను సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు(City Task Force Police) అరెస్ట్ చేశారు. ఇరానీగ్యాంగ్‌కు చెందిన సభ్యుడిగా గుర్తించిన పోలీసులు అతని నుంచి రూ.95వేల నగదు, నకిలీ పోలీస్ ఐడీ కార్డు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుదీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. బేగంబజార్, సుల్తాన్ బజార్, ఆఫ్జల్‌గంజ్, కుల్సుంపురా, లంగర్‌హౌజ్ పోలీస్ స్టేషన్‌ల పరిధుల్లో ఇటీవల వరుసగా దారిదోపిడీలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘావేశారు. పోలీసు అధికారిగా చెప్పుకుంటూ ఓ వ్యక్తి రోడ్డుమీద వెళ్తున్న వారిని బెదిరిస్తూ మీరు నకిలీ కరెన్సీ (దొంగనోట్లు) తీసుకెళ్తున్నట్లు సమాచారం వచ్చిందని, అందుకే మఫ్టీలో ఉండి చెక్ చేస్తున్నామని నకిలీ ఐడీతో వారిని బురిడీ కొట్టిస్తూ దారిదోపిడీలకు పాల్పడుతున్నాడని గుర్తించారు.
ఇదికూడా చదవండి: JNTU: జేఎన్‌టీయూలో క్యాంపస్ ప్లేస్‌మెంట్ల జోరు..
నగరంలోని పలు ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీ(CCTV footage)లు జల్లెడ పట్టి బేగంబజార్ పరిధిలో అతన్ని పట్టుకున్నారు. అతన్ని విచారించగా కర్ణాటక రాష్ట్రం బీదర్ ఇరానీ గల్లీలో ఉండే.. ఇరానీ ముఠాకు చెందిన జాఫర్ ఆలీ అలియాస్ లంబుగా ఒప్పుకొన్నాడు. ఇతను పలు నగరాల్లో తిరుగుతూ, వ్యాపార ప్రాంతాలు అధికంగా ఉండే ఏరియల్లో రెక్కీ చేస్తాడు. నగదు రవాణా చేసేవారిని గుర్తించి రహస్యంగా ఫాలో అయి, పోలీస్ అంటూ బెదిరిస్తాడు. మీవద్ద నకిలీ కరెన్సీ ఉందని చెక్ చేయాలని నమ్మిస్తాడు. ఈ క్రమంలో వారి దృష్టి మరల్చి నగదు లేదా బంగారం దోచుకొని ఉడాయిస్తాడు. ఇటీవల వరుసగా ఐదు కేసులు నమోదవడంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ బృందం రంగంలోకి దిగి, బేగంబజార్ పోలీసులతో కలిసి అతన్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
..............................................................................
ఈ వార్తను కూడా చదవండి:
................................................................................
Hyderabad మద్యం మత్తులో పాస్టర్‌పై దాడి..
హైదరాబాద్: మద్యం మత్తులో యువకులు ఓ పాస్టర్‌ను చితకబాదారు. గాజులరామారం(Gajularamaram) డివిజన్‌లోని దేవేందర్‌నగర్‌లోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో దైవాదన చర్చిలో పాస్టర్ ప్రసాద్ సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ చర్చిలో నుంచి బయటకు వచ్చాడు. చర్చి ప్రక్కనే ఉన్న నాల్గుఅంతస్తుల భవనంపై 8 మంది యువకులు గురువారం రాత్రి మద్యం సేవించారు. మందు తాగుతున్న యువకులు ఫోన్ మాట్లాడుతున్న పాస్టర్(Pastor) వద్దకు వచ్చి తమ వీడియో ఎందుకు తీస్తున్నావంటూ ప్రసాద్‌ను చితక బాదారు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కావడంతో సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి చికిత్స నిమిత్తం చేర్పించారు.
అయితే చర్చి ప్రక్కనే కొంత స్థలంలో చర్చి నిర్వహకులు గదిని నిర్మించారు. ఇది ఇష్టంలేని మందు తాగుతున్న యువకులు చర్చి లోపలికి వెళ్లి కిటికీ అద్దాలను, లోపల ఉన్న సామగ్రిని ధ్వంసం చేశారు. గురువారం రాత్రి సూరారం పోలీస్‌స్టేషన్(Suraram Police Station)లో బాదితుని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న మేడ్చల్ ఏసీపీ శ్రీనివా్‌సరెడ్డి సీఐ భరత్‌కుమార్‌తో కలిసి సంఘటనా స్ధలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పాస్టర్‌పై దాడి జరిగిన విషయం తెలుసుకున్న గాజుల రామారం కార్పొరేటర్ రావుల శేషగిరి, కుత్బుల్లాపూర్ పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొన్నారు. మరికొందరు పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News
Updated Date - Aug 17 , 2024 | 11:41 AM