ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: రూ.23 లక్షలు లూటీ చేసేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..

ABN, Publish Date - Jun 01 , 2024 | 10:54 AM

మనీల్యాండరింగ్‌ పేరుతో ఓ వృద్ధుడిని భయబ్రాంతులకు గురిచేసిన సైబర్‌(Cyber) కేటుగాళ్లు అతని నుంచి రూ.23 లక్షలను లూటీ చేశారు. తర్వాత మోసపోయానని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌క్రైమ్స్‌ పోలీసులు(Hyderabad CCS Cybercrimes Police) తెలిపిన వివరాల ప్రకారం..

- మనీల్యాండరింగ్‌ కేసు పేరుతో వృద్ధుడిని బెదిరించి దోపిడీ..

- సైబర్‌ కేటుగాళ్లపై కేసు

హైదరాబాద్: మనీల్యాండరింగ్‌ పేరుతో ఓ వృద్ధుడిని భయబ్రాంతులకు గురిచేసిన సైబర్‌(Cyber) కేటుగాళ్లు అతని నుంచి రూ.23 లక్షలను లూటీ చేశారు. తర్వాత మోసపోయానని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌క్రైమ్స్‌ పోలీసులు(Hyderabad CCS Cybercrimes Police) తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 64 ఏళ్ల వృద్ధుడికి ఇటీవల ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. అవతలి వ్యక్తి తాను ఢిల్లీ లజ్‌పత్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ నుంచి కానిస్టేబుల్‌ను కాల్‌ చేస్తున్నానని చెప్పాడు. అతనిపై తమ పీఎ్‌సలో మనీల్యాండరింగ్‌ కేసు నమోదైందని, ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన రూ.300 కోట్ల మనీల్యాండరింగ్‌ వ్యవహారంలో నవాబ్‌ మాలిక్‌ అనే వ్యక్తిపై కేసు నమోదైందని, అతని లావాదేవీల్లో మీ బ్యాంకు అకౌంట్‌ కూడా ఉందని చెప్పారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య


తర్వాత ఢిల్లీ సైబర్‌క్రైమ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ను అంటూ మరోవ్యక్తి ఫోన్‌ చేసి.. ‘వెంటనే మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు మా బ్యాంక్‌ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయాలి.. అన్నీ పరిశీలించిన తర్వాత నిర్ధారించుకుని మళ్లీ మీ బ్యాంకు ఖాతాకు డబ్బులు జమచేస్తాం.. లేనిపక్షంలో వెంటనే అరెస్టు చేస్తాం..’ అని భయపెట్టాడు. దీంతో ఆందోళనకు గురైన వృద్ధుడు తన బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం రూ.23లక్షలను ఆగంతుకుడు సూచించిన బ్యాంక్‌ ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. ఆ వెంటనే ఆగంతకుడు కాల్‌ కట్‌చేసి స్విచ్ఛాఫ్‌ చేశాడు. మొదట వచ్చిన ఫోన్‌కాల్‌కు ప్రయత్నించగా అది కూడా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్‌క్రైమ్స్‌ పోలీసులను ఆశ్రయించాడు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 10:54 AM

Advertising
Advertising