ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: అత్తింటి వేధింపులతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

ABN, Publish Date - Dec 14 , 2024 | 08:16 AM

భర్త, అత్తల వేధింపులు తాళలేని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా చిత్తాపూర్‌ గ్రామానికి చెందిన మొక్కపాటి శ్రీనివాసరావు(Mokkapati Srinivasa Rao) పెద్ద కుమార్తె వెంకట నాగలక్ష్మి (28) మియాపూర్‌ మాతృశ్రీనగర్‌లో ఉంటూ ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తోంది.

హైదరాబాద్: భర్త, అత్తల వేధింపులు తాళలేని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా చిత్తాపూర్‌ గ్రామానికి చెందిన మొక్కపాటి శ్రీనివాసరావు(Mokkapati Srinivasa Rao) పెద్ద కుమార్తె వెంకట నాగలక్ష్మి (28) మియాపూర్‌ మాతృశ్రీనగర్‌లో ఉంటూ ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. నాగలక్ష్మికి 2018లో వివాహం చేయగా ఓ పాప పట్టింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Tirumala: తిరుమల నడకదారిలో భక్తుడు మృతి


దీంతో తల్లిదండ్రులు నాగలక్ష్మికి నగరంలో ఉంటున్న ఏలూరుకు చెందిన సివిల్‌ కాంట్రాక్టర్‌ మనోజ్‌కు ఇచ్చి ఈ ఏడాది ఆగస్టు 22న రెండో వివాహం జరిపించారు. పెళ్లైన నాటి నుంచి నాగలక్ష్మి(Nagalakshmi)ని మనోజ్‌ వేధిస్తున్నాడు. అతడికి మనోజ్‌ తల్లి సహకరించేది. నాగలక్ష్మికి తల్లిదండ్రులు గతంలో తమ స్వగ్రామంలో 1.5 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చారు. ఆ భూమిని తన పేరు మీద రాయాలని, ఆ భూమిపై వచ్చే ఆదాయం తనకే ఇవ్వాలని నాగలక్ష్మిని భర్త వేధించేవాడు.


ఎలాంటి పని చేయకుండా ఇంటి వద్దే ఉండే అతను భార్యను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. అంతేకాకుండా నాగలక్ష్మికి మొదటి భర్త ద్వారా పుట్టిన పాపను హాస్టల్‌లో వేస్తానని బెదిరించేవాడు. భర్త తనను వేధిస్తున్న తీరును నాగలక్ష్మి తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పేది. తల్లిదండ్రులను వచ్చి తన సమస్యను పరిష్కరించాలని కోరేది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా మనోజ్‌ భార్యను విపరీతంగా కొడుతున్నాడు.


ఇదిలా ఉండగా.. నాగలక్ష్మి విషం తాగిందని, ఆస్పత్రిలో చేర్చామని మనోజ్‌ ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ఆస్పత్రిలో చేరిన నాగలక్ష్మి చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయింది. తన కుమార్తె మృతికి ఆమె భర్త మనోజ్‌, అత్త లక్ష్మిల వేధింపులే కారణమని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్‌ పోలీసులు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Nelakondapalli : కిరాయికి దిగి కిరాతకానికి ఒడిగట్టారు

ఈవార్తను కూడా చదవండి: High Court: మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఈవార్తను కూడా చదవండి: కుల గణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు భాగస్వాములు కావాలి

ఈవార్తను కూడా చదవండి: K. Kavitha: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహంపై జీవో

Read Latest Telangana News and National News

Updated Date - Dec 14 , 2024 | 08:16 AM