ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కూతురి ప్రసవం కోసం వెళ్తే ఇల్లు గుల్లయింది..

ABN, Publish Date - Nov 30 , 2024 | 09:25 AM

కూతురు ప్రసవం కోసం వెళ్తే ఇల్లు గుల్ల చేసిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌(Kukatpally Police Station) పరిధిలో జరిగింది. బాధితులు మధుసూదన్‌రావు, సంధ్యారాణి దంపతులు, డీఐ వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. జయానగర్‌లో బిల్డర్‌ మధుసూదన్‌రావు తన భార్యతో కలిసి సీతా ప్యాలెల్‌ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ నంబర్‌ 301లో నివాసం ఉంటున్నారు.

- జయానగర్‌లో 820 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 2 లక్షలు చోరీ

హైదరాబాద్: కూతురు ప్రసవం కోసం వెళ్తే ఇల్లు గుల్ల చేసిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌(Kukatpally Police Station) పరిధిలో జరిగింది. బాధితులు మధుసూదన్‌రావు, సంధ్యారాణి దంపతులు, డీఐ వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. జయానగర్‌లో బిల్డర్‌ మధుసూదన్‌రావు తన భార్యతో కలిసి సీతా ప్యాలెల్‌ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ నంబర్‌ 301లో నివాసం ఉంటున్నారు. నెలరోజులుగా మియాపూర్‌(Miyapur)లో ఉండే తన కూతురు ప్రసవం కోసం వెళ్లి సంధ్యారాణి అక్కడే ఉంటుండగా.. మధుసూదన్‌రావు మాత్రం అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవారు.

ఈ వార్తను కూడా చదవండి: Cyber criminals: మనీ లాండరింగ్‌ కేసుల పేరుతో రూ.2.95 లక్షలు కొట్టేశారుగా..


ఇదే క్రమంలో గురువారం సాయంత్రం కూడా మధుసూదన్‌రావు ఇంటికి వచ్చి వెళ్లాడు. శుక్రవారం ఉదయం ‘మీ ఇంట్లో ఎవరో దొంగలు పడ్డారని,’ ఇంటి డ్రైవర్‌ చెప్పడంతో వారు ఇద్దరు హుటాహుటీనా ఇంటికి వచ్చి చూశారు. బీరువా తాలం చెవి తీసుకొని అందులోని 820 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక డైమండ్‌ నెక్సెస్‌, రూ. 2లక్షల నగదు పోయాయని కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఐ వెంకటేశం తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వచ్చి బాధితుల నుంచి వివరాలు సేకరించారు.


గురువారం రాత్రి 11.47 నిమిషాల సమయంలో ఇద్దరు వ్యక్తులు ఎటువంటి ఆనవాళ్లు కనిపించకుండా స్వెటర్‌లు ధరించి ఫుల్‌గా దుస్తులుఽ ధరించి అపార్ట్‌మెంట్‌లోకి వచ్చినట్టు సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా గుర్తించారు. బీరువా తాళం పగుల గొట్టకుండా తాళం చెవితో ఓపెన్‌ చేసి, బంగారు ఆభరణాలు, నగదు తీసుకెళ్లిన దొంగలు వెండిని మాత్రం తీసుకోకపోవడం గమనార్హం. ఇది ఇలా ఉండగా.. నేను ఎక్కడ తాళం పెట్టానో తెలుసుకొని దొంగలు తాళం చెవి ద్వారా బీరువా తెరిచారని బాధితురాలు చెప్పింది.


దీంతో నిజంగా దొంగల పనేనా? లేక ఎవరైనా బాగా తెలిసిన వ్యక్తులే చోరీకి పాల్పడ్డారా అన్నది సస్పెన్షన్‌. మెయిన్‌ డోర్‌ లాక్‌ మాత్రం బ్రేక్‌ చేయడంతో పోలీసులు ఈ కేసును సీరియ్‌సగా తీసుకున్నారు. దొంగల ఆకూకీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డాగ్‌స్వాడ్‌, క్లూస్‌టీం, ఇతర విభాగాల సహాయం తీసుకొని త్వరలో కేసును చేధిస్తామని డీఐ చెప్పారు.


ఈవార్తను కూడా చదవండి: మూడు జిల్లాల్లో 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

ఈవార్తను కూడా చదవండి: పోటీపై అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం

ఈవార్తను కూడా చదవండి: రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.141.84 కోట్లు

ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌‌పై హరీష్ విసుర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 30 , 2024 | 09:25 AM