ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: జాలరులను బెదిరించి డబ్బులు లాక్కున్న రౌడీషీటర్‌...

ABN, Publish Date - Jun 26 , 2024 | 11:55 AM

చెరువులో చేపలు పట్టుకుంటున్న జాలర్లను బెదిరించిన ఓ రౌడీషీటర్‌(Rowdy sheeter) వారి వద్ద డబ్బు లాక్కున్నాడు. నార్సింగ్‌ పోలీసుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్‌గా నమోదైన ఇర్ఫాన్‌ సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి పీరంచెరువు కట్టపై మద్యం తాగాడు.

హైదరాబాద్: చెరువులో చేపలు పట్టుకుంటున్న జాలర్లను బెదిరించిన ఓ రౌడీషీటర్‌(Rowdy sheeter) వారి వద్ద డబ్బు లాక్కున్నాడు. నార్సింగ్‌ పోలీసుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్‌గా నమోదైన ఇర్ఫాన్‌ సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి పీరంచెరువు కట్టపై మద్యం తాగాడు. అదే సమయంలో చెరువులో చేపల వేటకోసం వలలు వేసేందుకు వచ్చిన ఉప్పర్‌పల్లి(Upparpally)కి చెందిన సందీప్ కుమార్‌ అతడి సహచరుల వద్దకు ఇర్ఫాన్‌, అతడి మనుషులు వెళ్లారు. ‘ఇప్పటికే అనేక మర్డర్లు చేశాను. వారం రోజుల క్రితమే జైలు నుంచి వచ్చాను.

ఇదికూడా చదవండి: Shamshabad: బంగారాన్ని కరిగించి, పేస్టుగా మార్చి.. అక్రమంగా తరలిస్తూ..


మిమ్మల్ని చంపి మళ్లీ జైలుకు పోతాను’ అంటూ ఇర్ఫాన్‌ కత్తితీసి జాలార్ల ముందు తిప్పడంతో వారికి స్వల్పగాయాలయ్యాయి. జేబులో ఎంత ఉంటే అంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో సందీప్ కుమార్‌ జేబులో ఉన్న రూ.11 వేలు ఇర్ఫాన్‌కు ఇచ్చేసి అక్కడి నుంచి పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇర్ఫాన్‌ కోసం గాలిస్తున్నారు. గతంలో పీరంచెరువు వద్ద డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు జరుగుతున్న సమయంలో ఇర్ఫాన్‌ ద్విచక్ర వాహనాన్ని కాల్చివేసి హంగామా సృష్టించాడు. ఈ కేసులో అతడు జైలుకెళ్లి వచ్చాడు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 26 , 2024 | 11:55 AM

Advertising
Advertising