ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: జైలులో కలిశారు.. ముఠాగా ఏర్పడ్డారు

ABN, Publish Date - Dec 18 , 2024 | 07:59 AM

గంజాయి రవాణా చేస్తూ పట్టుబడి జైలుకు వెళ్లారు. అక్కడ కలిసిన ఐదుగురు నిందితులతో ఒక ముఠాగా ఏర్పడ్డారు. జైలు నుంచి విడుదల కాగానే మళ్లీ అదేబాట పట్టారు. న్యూ ఇయర్‌ వేడుకలకు గంజాయిని నగరంలో విక్రయించేందుకు తీసుకువస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. 35 కేజీల గంజాయితోపాటు కారు, బైకు, ఐదు ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- న్యూ ఇయర్‌ వేడుకలకు గంజాయి విక్రయించాలని పథకం..

- రవాణా చేస్తూ పట్టుబడిన ముఠాసభ్యులు

- 35 కేజీల గంజాయి, కారు, బైక్‌, ఐదు ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

- వీటి విలువ రూ.15లక్షలు

హైదరాబాద్: గంజాయి రవాణా చేస్తూ పట్టుబడి జైలుకు వెళ్లారు. అక్కడ కలిసిన ఐదుగురు నిందితులతో ఒక ముఠాగా ఏర్పడ్డారు. జైలు నుంచి విడుదల కాగానే మళ్లీ అదేబాట పట్టారు. న్యూ ఇయర్‌ వేడుకలకు గంజాయిని నగరంలో విక్రయించేందుకు తీసుకువస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. 35 కేజీల గంజాయితోపాటు కారు, బైకు, ఐదు ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.15లక్షలు ఉంటుందని తెలిపారు. ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మలక్‌పేట పోలీస్‏స్టేషన్‌(Malakpet Police Station)లో సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ అడిషనల్‌ డీసీపీ టి.స్వామి మంగళవారం మీడియాకు వివరాలు తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Pushpak Buses: లింగంపల్లి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి పుష్పక్‌ బస్సులు


యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోతుకూరు గ్రామ నివాసి ఇక్కిరి భాస్కర్‌ ఎలియాస్‌ ఎక్కిరి భాస్కర్‌ ఎలియాస్‌ బాచి (27) వృత్తి రీత్యా టైల్స్‌ వర్కర్‌. ఇదే గ్రామానికి చెందిన వల్లందాసు వంశీ (25), జిట్టా కిరణ్‌ (22)లు ట్రాక్టర్‌ డ్రైవర్లుగా, బోయిని వంశీ (28) రోజువారి కూలిగా పనిచేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రకు చెందిన ఆల భరత్‌కుమార్‌రెడ్డి(32) మియాపూర్‌లోని పెట్రోల్‌ బంకులో పనిచేసేవాడు. వీరు గంజాయి విక్రయిస్తూ, ఇతర కేసుల్లో పలుమార్లు జైలుకు వెళ్లారు. జనగామ జిల్లా జైలులో కలిసి ముఠాగా ఏర్పడ్డారు.


జైలు నుంచి విడుదలైన తర్వాత ఐదుగురు సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో న్యూ ఇయర్‌ వేడుకలకు గంజాయి విక్రయించాలని ప్లాన్‌ చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి తీసుకువచ్చి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఎస్‌.ఆత్మకూరు గ్రామంలో నిల్వ ఉంచారు. న్యూ ఇయర్‌ వేడుకలకు ముందే గంజాయిని నగరంలోని ధూల్‌పేటకు తరలించి చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని పథకం వేశారు. ఎస్‌.ఆత్మకూరు గ్రామం నుంచి కారులో ఇక్కిరి భాస్కర్‌, ఆల భరత్‌కుమార్‌రెడ్డి, వల్లందాసు వంశీ గంజాయిని తీసుకుని మంగళవారం బయలుదేరారు.


దారిలో పోలీసుల తనిఖీలు ఉన్నాయా.. లేదా అని గుర్తించేందుకు జిట్టా కిరణ్‌, బోయిని వంశీలు బైక్‌పై పైలట్‌గా వచ్చారు. అప్పటికే విశ్వసనీయ సమాచారం అందుకున్న మలక్‌పేట ఎస్‌ఐ నవీన్‌ గడ్డిఅన్నారం చౌరస్తాలో వాహనాల తనిఖీ చేపట్టారు. సరూర్‌నగర్‌ చెరువు కట్ట మీదుగా వస్తున్న మారుతీ కారును తనిఖీ చేశారు. అందులో గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. వాటిని తూకం వేయగా 35 కిలోలున్నాయని అడిషనల్‌ డీసీపీ స్వామి వివరించారు. ఐదుగురు నిందితులను మలక్‌పేట, సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కలిసి అరెస్టు చేశారు. కేసును మలక్‌పేట ఏసీపీ శ్యాంసుందర్‌, ఇన్‌స్పెక్టర్‌ పి.నరేష్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ నవీన్‌ దర్యాప్తు చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Youth Addiction : మృత్యు వలయం

ఈవార్తను కూడా చదవండి: బీఆర్ఎస్ నేతలకు సవాల్, చర్చకు సిద్ధమా..

ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు

ఈవార్తను కూడా చదవండి: లగచర్ల రైతులపై కేసులు ఎత్తివేయాలి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 18 , 2024 | 07:59 AM