ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: ఫుట్‌పాత్‌లు, ఆటోల్లో నిద్రిస్తున్న వారే టార్గెట్‌...

ABN, Publish Date - Apr 23 , 2024 | 11:10 AM

రాత్రివేళ రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌లు, ఆటోలలో నిద్రిస్తున్న వ్యక్తులను టార్గెట్‌గా చేసుకుని స్నాచింగ్‌, దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను నల్లకుంట పోలీసులు(Nallakunta Police) అరెస్ట్‌ చేశారు.

- స్నాచింగ్‌, దొంగతనాలు చేస్తున్న ముగ్గురి అరెస్ట్‌

- రెండు బైక్‌లు, మూడు సెల్‌ఫోన్లు, రూ.1,600 నగదు స్వాధీనం

హైదరాబాద్: రాత్రివేళ రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌లు, ఆటోలలో నిద్రిస్తున్న వ్యక్తులను టార్గెట్‌గా చేసుకుని స్నాచింగ్‌, దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను నల్లకుంట పోలీసులు(Nallakunta Police) అరెస్ట్‌ చేశారు. వారి నుంచి ఒక కత్తి, త్రిషూల్‌, బ్లేడ్‌, రెండు బైక్‌లు, మూడు సెల్‌ఫోన్లు, రూ.1,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నల్లకుంట పీఎస్‏లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓయూ ఏసీపీ జగన్‌, నల్లకుంట సీఐ జగదీశ్వర్‌రావు, లాలాగూడ సీఐ రమేష్ గౌడ్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. నగరంలోని బోరబండ, ఎర్రగడ్డ(Borabanda, Erragadda) ప్రాంతాల్లో నివాసముంటున్న కల్మేర రమేష్‌, పెండల వెంకటస్వామి, కమ్మగోని కార్తీక్‌గౌడ్‌ ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడ్డారు. రాత్రివేళ రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌లు, ఆటోలలో నిద్రిస్తున్న వ్యక్తులను బెదిరించి వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లు, డబ్బులు, వారి వాహనాలను దొంగిలిస్తున్నారు.

ఇదికూడా చదవండి: MLA: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు నమోదు

తద్వారా వచ్చిన డబ్బుతో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ నెల 13న ఎస్‌.నందకుమార్‌ అనే వ్యక్తి రాయదుర్గంలో గల ఆజుబా సాల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పనిచేస్తున్నాడు. రాత్రి ఆయన మద్యం తాగి తన బైక్‌పై వస్తూ మెట్టుగూడ మెట్రో స్టేషన్‌ వద్దకు రాగానే బైక్‌ నడపడం వీలుకాకపోవడంతో బస్టా్‌ఫలో బైక్‌ పార్కింగ్‌ చేసి సెల్‌ఫోన్‌ జేబులో పెట్టుకుని పడుకున్నాడు. కొంత సమయం తర్వాత నిద్రలేవగానే పార్కింగ్‌ చేసిన యాక్టివా, జేబులో సెల్‌ఫోన్‌ కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 17న తెల్లవారుజామున నాలుగున్నర సమయంలో రమావత్‌ రాజు అనే వ్యక్తి నల్లకుంట మోడల్‌ రైతు చికెన్‌ బజార్‌ వద్ద ఫుట్‌పాత్‌పై పడుకున్నాడు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు యాక్టివాపై వచ్చి అతన్ని కత్తితో బెదిరించి అతని వద్ద నుంచి కీ ప్యాడ్‌, మొబైల్‌, రూ. 3 వేలు తస్కరించారు. ఆయన నల్లకుంట పీఎ్‌సలో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదికూడా చదవండి: సూర్యాపేట కాంగ్రెస్‌ నేత ఏపీలో కిడ్నాప్‌?

ఎస్‌ఐ కృష్ణ, క్రైమ్‌ సిబ్బందితో కలిసి బోరబండలో ముగ్గురు కల్మేర రమేష్‌, పెండల వెంకటస్వామి, కమ్మగోని కార్తీక్‌గౌడ్‌లను పట్టుకున్నారు. ఈ ముగ్గురు 3 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నారని ఏసీపీ తెలిపారు. ఇందులో వెంకటస్వామి 16 నెలలు జైలుకు వెళ్లి వచ్చాడని, తిరిగి వచ్చిన వెంటనే దొంగతనాలు, స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఎస్‌ఆర్‌నగర్‌, లాలాగూడ, నల్లకుంట, జీడిమెట్ల, కూకట్‌పల్లి పీఎస్‏ల పరిధిలో ఇలాంటి దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. వీరిపై ఆర్మ్‌యాక్ట్‌ కూడా నమోదు చేశామని తెలిపారు. రాత్రిపూట పుట్‌ఫాత్‌, బస్టాఫ్‌, ఆటోలలో నిద్రించే వారు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు కృష్ణ, శ్రీనివాసరావు, రమాదేవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వీరిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందికి రివార్డు ఇవ్వనున్నట్లు ఏసీపీ జగన్‌ ప్రకటించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: హాస్టల్‌ సంపులో పడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

Read More Crime News and Telugu News

Updated Date - Apr 23 , 2024 | 11:10 AM

Advertising
Advertising