Hyderabad: భర్త మోసం చేశాడని భార్యకు వేధింపులు
ABN, Publish Date - Dec 19 , 2024 | 10:25 AM
తన భర్త తీసుకున్న డబ్బుల విషయంలో తనను మానసికంగా వేధించడంతో పాటు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసినా స్వీకరించని పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితురాల దాసరి రమ్య(Dasari Ramya) రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు.
- ఫిర్యాదు చేసినా స్వీకరించని పోలీసులు
- న్యాయం చేయాలని ప్రభుత్వం, అధికారులకు బాధితురాలి వినతి
హైదరాబాద్: తన భర్త తీసుకున్న డబ్బుల విషయంలో తనను మానసికంగా వేధించడంతో పాటు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసినా స్వీకరించని పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితురాల దాసరి రమ్య(Dasari Ramya) రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. బుధవారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సికింద్రాబాద్‌కు చెందిన కల్యాణ్‌ను 2009లో ప్రేమ వివాహం చేసుకున్నానని, తనకు ముగ్గురు సంతానమని తెలిపింది.
ఈ వార్తను కూడా చదవండి: GHMC: ఖాళీ స్థలాల సరిహద్దులకు డిజిలైట్.. జియో ఫెన్సింగ్
మనస్పర్థల కారణంగా 2020లో కోర్టు నుంచి విడాకులు తీసుకున్నామన్నారు. ఆ తర్వాత వారసిగూడ(Warasiguda)కు చెందిన నంబూరి విజయ్‌వంశీ తాను రైల్వే ఉద్యోగినని, తన పిల్లలను చూసుకుంటానని చెప్పడంతో 2021లో పెద్దల సమక్షంలో ద్వితీయ వివాహం చేసుకున్నట్లు తెలిపారు. వివాహ సమయంలో రూ.10 లక్షలు, 40 తులాల బంగారం కట్నం కింద ఇచ్చినట్లు వివరించింది.
వివాహం తర్వాత 3 నెలల నుంచి విజయ్‌వంశీ మద్యం సేవించి అదనపు కట్నం కోసం నిత్యం తనను వేధింపులకు గురిచేశాడని వాపోయింది. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం తీసుకుని తనను పిల్లలను వదిలివేసి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తెలియకుండానే కొంత మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వారి నుంచి విజయ్‌వంశీ డబ్బులు తీసుకున్నాడని తెలిపారు.
ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో విజయ్‌వంశీపై బాధితులు నవంబర్ 28న చిలకలగూడ, ఈనెల 3న చైతన్యపురి పీఎ్‌సలలో ఫిర్యాదు చేశారని తెలిపారు. అ యితే ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను పోలీసులు మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాల ని ఆమె కోరారు. లేనిపక్షంలో తనకు ఆత్మహత్యే శరణ్యమని కన్నీటిపర్యంతమయ్యారు.
ఈవార్తను కూడా చదవండి: Prasad Behra: షూటింగ్‌లో నటితో అసభ్య ప్రవర్తన
ఈవార్తను కూడా చదవండి: పదేళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది: కోమటిరెడ్డి
ఈవార్తను కూడా చదవండి: CM Revanth: ఆ ఇద్దరు కలిసి దేశ పరువు తీశారు
ఈవార్తను కూడా చదవండి: నాపై ఇలాంటి ఆరోపణలు సిగ్గుచేటు..
Read Latest Telangana News and National News
Updated Date - Dec 19 , 2024 | 10:25 AM