MLA: ఎమ్మెల్యేపై కోడిగుడ్లతో దాడి.. ముగ్గురి అరెస్టు
ABN, Publish Date - Dec 26 , 2024 | 01:06 PM
బెంగళూరు రాజరాజేశ్వరినగర్ బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న(Rajarajeshwari Nagar BJP MLA Munirathna)పై కోడిగుడ్లతో దాడి చేశారు. బుధవారం ఆర్‌ఆర్ నగర పరిధిలోని లక్ష్మిదేవి నగర్ వార్డు బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి జయంతిలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేపై గుడ్లతో దాడి చేశారు.
- నా హత్యకు కుట్ర: ఎమ్మెల్యే
- రోడ్డుపై బైఠాయించి నిరసన
బెంగళూరు: బెంగళూరు రాజరాజేశ్వరినగర్ బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న(Rajarajeshwari Nagar BJP MLA Munirathna)పై కోడిగుడ్లతో దాడి చేశారు. బుధవారం ఆర్‌ఆర్ నగర పరిధిలోని లక్ష్మిదేవి నగర్ వార్డు బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి జయంతిలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేపై గుడ్లతో దాడి చేశారు. నందిని పోలీస్‌స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఇదే సందర్భంగా ఎమ్మెల్యే మునిరత్న(MLA Munirathna) రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.
ఈ వార్తను కూడా చదవండి: Bike race: భయభ్రాంతులకు గురిచేస్తూ బైక్ రేస్..
స్థానిక కాంగ్రెస్ నాయకురాలు కుసుమ, ఆమె తండ్రి హనుమంతరాయప్పలు కుట్ర పన్నార న్నారు. డీసీఎం డీకే శివకుమార్(DCM DK Shivakumar), ఆయన సోదరుడు డీకే సురేశ్‌లు నన్ను హత్య చేసేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిం చారని ఆరోపించారు. 150మంది వారి అనుచరులు ఒక్కసారిగా దాడికి దిగారన్నారు. బీజేపీ కార్యకర్తలు, నా అభిమానులు, పోలీసులు లేనిపక్షంలో హతమార్చేవారన్నారు. వారి దాడి వెనుక కుట్ర ఉందన్నారు
రాష్ట్రానికి జరిగిన అవమానం: విజయేంద్ర
ఎమ్మెల్యే మునిరత్నపై దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP state president Vijayendra) తీవ్రంగా ఖండించారు. ఇది మునిరత్నకు జరిగిన అవమానం కాదని, రాష్ట్రానికి జరిగిన అవమానమన్నారు. ఇటువంటి దాడుల వెనుక ప్రత్యర్థులు ఏమి ఆశిస్తున్నారనేది అర్థం అవుతుందన్నారు. సువర్ణసౌధలో ఎమ్మెల్సీ సీటీ రవి(MLC CT Ravi)పై దాడి చేశారని, సొంత నియోజకవర్గంలో తిరుగుతున్న ఎమ్మెల్యేపై దాడిని ఏమని అర్థం చేసుకోవాలన్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులు ఇటువంటి కేసులలో నిర్లక్ష్యం చేయరాదన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Investigation: కర్త, కర్మ, క్రియ.. కేటీఆరే!
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: జానీ మాస్టర్ లైంగిక వేధింపులు నిజమే
ఈవార్తను కూడా చదవండి: ఆహా.. ఏం ఐడియాగురూ.. వాట్సాప్ డీపీ మార్చి.. మెసేజ్ పంపి..
ఈవార్తను కూడా చదవండి: Pneumonia: పిల్లలపై న్యుమోనియా పంజా
Read Latest Telangana News and National News
Updated Date - Dec 26 , 2024 | 01:06 PM