ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gold Seized: ఐడియా చుశారా ఖర్జూరంలో దాచి రూ.1.72 కోట్ల గోల్డ్ అక్రమ రవాణా.. చివరకు

ABN, Publish Date - Mar 16 , 2024 | 10:04 AM

దేశంలో పుత్తడిని అక్రమంగా రవాణా చేసే కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేటుగాళ్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ బంగారాన్ని గుట్టుచప్పుడుకాకుండా తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటివల ఖర్జూరాలలో పుత్తడిని అక్రమంగా రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయారు.

దేశంలో పుత్తడిని అక్రమంగా రవాణా చేసే కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేటుగాళ్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ బంగారాన్ని(gold) గుట్టుచప్పుడుకాకుండా తీసుకెళ్తున్నారు. గతంలో బిస్కెట్ల రూపంలో, పేస్టు రూపంలో, పళ్లిళ్లు లేదా చాక్లెట్ల మాదిరిగా గోల్డ్ అక్రమంగా రవాణా చేసిన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజా ఏకంగా ఖర్జూరాల(dates)లో కూడా పుత్తడిని అక్రమంగా రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన ముంబై(mumbai)లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం(chhatrapati international airport)లో చోటుచేసుకుంది.


ఇటివల జరిగిన ఐదు దాడుల్లో రూ. 1.72 కోట్ల విలువైన దాదాపు 3 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు(officers) స్వాధీనం చేసుకున్నారు. మార్చి 14 నుంచి 15 తేదీలలో ఎయిర్‌పోర్ట్ కమిషనరేట్, ముంబై కస్టమ్స్ అధికారులు చేసిన సోదాల్లో 2.99 కిలోల బంగారాన్ని(gold) స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే సోదాల్లో భాగంగా దుండగులు బంగారాన్ని శరీర కుహరం, ఖర్జూరం లోపల దాచారని కస్టమ్స్ అధికారులు చెప్పారు. అంతేకాదు మరికొంత పుత్తడిని Samsung Galaxy Z Fold 5 (1), Galaxy Z Flip 5(1), Galaxy S20 5G(30), iPhone 15 Pro(1) , iPhone SE 256 GB(2), Dell Laptop Latitude 5400(13) వంటి ఫోన్లలో కూడా దాచి ఉంచారని అధికారులు తెలిపారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Kavitha: కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చనున్న అధికారులు

Updated Date - Mar 16 , 2024 | 10:04 AM

Advertising
Advertising