ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కుమార్తె పుట్టినరోజున.. తండ్రి వాహనం కింద నలిగి కొడుకు దుర్మరణం

ABN, Publish Date - Sep 17 , 2024 | 10:50 AM

కుమార్తె పుట్టినరోజు కావడంతో త్వరగా ఇంటికి రావాలన్న తండ్రి ఆతృత కుమారుడిని బలిగొనేలా చేసింది. డీసీఎం వ్యాన్‌ రివర్స్‌ తీస్తుండగా దానికింద ఆడుకుంటున్న ఒక్కగానొక్క కుమారుడు చక్రాల కింద నలిగి కన్నుమూశాడు.

- డీసీఎం రివర్స్‌ తీస్తుండగా దుర్ఘటన

- మరో ఘటనలో ఔటర్‌ పైనుంచి లారీ బోల్తా

- డ్రైవర్‌ దుర్మరణం, క్లీనర్‌కు తీవ్రగాయాలు

హైదరాబాద్: కుమార్తె పుట్టినరోజు కావడంతో త్వరగా ఇంటికి రావాలన్న తండ్రి ఆతృత కుమారుడిని బలిగొనేలా చేసింది. డీసీఎం వ్యాన్‌ రివర్స్‌ తీస్తుండగా దానికింద ఆడుకుంటున్న ఒక్కగానొక్క కుమారుడు చక్రాల కింద నలిగి కన్నుమూశాడు. రాజేంద్రనగర్‌(Rajendranagar) పోలీసుల వివరాల ప్రకారం.. కర్నూలుకు చెందిన కృష్ణ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి కిస్మత్‌పూర్‌(Kismatpur)లోని ఓ సిమెంటు ఇటుకలు తయారీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: 4 నెలల ముందే రైళ్లన్నీ ఫుల్‌..


సోమవారం కుమార్తె పుట్టినరోజు ఉండటంతో సిమెంటు ఇటుకలను డెలివరీ చేసి త్వరగా ఇంటికి రావాలనుకొని చూసుకోకుండా డీసీఎం(DCM)ను రివర్స్‌ చేస్తున్నాడు. వాహనం కింద ఆడుకుంటున్న కుమారుడు విఘ్నే్‌ష(3)పైకి చక్రాలు ఎక్కడంతో నలిగిపోయి మరణించాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు కన్నుమూయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


...........................................................

ఈ వార్తను కూడా చదవండి:

..........................................................

MLA: రద్దు చేసిన రేషన్‌కార్డులను పునరుద్ధరించాలి

- డీలర్లకు నెల వేతనం ఇవ్వాలి

- మంత్రి ఉత్తమ్‌కు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి లేఖ

హైదరాబాద్: కొత్తరేషన్‌ కార్డుల జారీతోపాటే రేషన్‌డీలర్ల సంక్షేమంపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి(Malkajigiri MLA Marri Rajasekhar Reddy)) పలు సూచనలు చేస్తూ సోమవారం పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy)కి లేఖ రాశారు. నియోజకవర్గంలో 76 వేల రేషన్‌కార్డుదారులకు 105 రేషన్‌ దుకాణాల ద్వారా రేషన్‌ సరుకుల పంపిణీ చేపడుతున్నారు. ఈ సేవలకు సంబంధించిన పలు విషయాలు ఈ లేఖలో వివరించారు.


హెచ్‌ఐవీ, తలసీమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులతో పాటు కీమోథెరపీ చికిత్స పొందుతున్న క్యాన్సర్‌ బాధితులకు, డయాలసిస్‌ రోగులకు కొత్తరేషన్‌ కార్డులు అందజేయాలని సూచించారు. రేషన్‌కార్డులో చేర్పులు, మార్పులు స్థానికంగా నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని, సదరం సర్టిఫికెట్లు కలిగి ఉన్న వారికి 35 కేజీల బియ్యం అందించాలని, స్మార్ట్‌కార్డు ద్వారా సేవలు అందించాలని, రద్దు చేసిన కార్డులను పునరుద్ధరణ చేయాలని ఆయన పేర్కొన్నారు.


రేషన్‌ డీలర్లకు రూ.20 వేల వేతనం ఇవ్వాలి..

రేషన్‌డీలర్ల సంక్షేమానికి కూడా ఎమ్మెల్యే మర్రి పలు సూచనలు చేశారు. పట్టణ ప్రాంత డీలర్లకు నెలకు రూ.20 వేల వేతనం ఇవ్వాలని కోరారు. జీవిత, ప్రమాదబీమా పాలసీలను రేషన్‌డీలర్లకు కల్పించాలని పేర్కొన్నారు. గన్నీ బ్యాగుల లీకేజీలను నివారించాలని, ప్రజాపంపిణీ తేదీతో నిమిత్తం లేకుండా నెల రోజులు చేపట్టాలని సూచించారు. జనాభా ప్రాతిపాదికన షాపులను పెంచేలా చర్యలు తీసుకొవాలని కోరుతూ మంత్రి ఉత్తమ్‌కు ఎమ్మెల్యే లేఖ రాసినట్లు పేర్కొన్నారు.


ఇదికూడా చదవండి: Jani Master: జానీ మాస్టర్‌పై..లైంగిక దాడి కేసు

ఇదికూడా చదవండి: Rajagopal Reddy: పొద్దుగాల ఈ తాగుడేంది?

ఇదికూడా చదవండి: BRS: రేవంత్‌రెడ్డిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం ..

Read LatestTelangana NewsandNational News

Updated Date - Sep 17 , 2024 | 10:53 AM

Advertising
Advertising