ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sangareddy: ఆటో అద్దె డబ్బులు అడిగినందుకు హత్య

ABN, Publish Date - Apr 24 , 2024 | 10:27 AM

సంగారెడ్డి జిల్లా మండల కేంద్రం కోహీర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్‌(Jagadgirigutta, Quthbullapur) ప్రాంతానికి చెందిన షేక్‌ అన్వర్‌అలీ(30) సోమవారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు.

- కోహీర్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితులు

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా మండల కేంద్రం కోహీర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్‌(Jagadgirigutta, Quthbullapur) ప్రాంతానికి చెందిన షేక్‌ అన్వర్‌అలీ(30) సోమవారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు. కోహీర్‌ పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు.. కోహీర్‌ మండలంలోని రాజనెల్లి గ్రామానికి చెందిన ముస్తకీమ్‌, గురుజువాడ గ్రామానికి చెందిన మహ్మద్‌ కైఫ్‌లు హైదరాబాద్‌ ఉండే అన్వర్‌అలీ వద్ద ఆటోను అద్దెకు తీసుకొని నడుపుతుంటారు. అయితే అన్వర్‌అలీకి ఇవ్వాల్సిన ఆటో అద్దె డబ్బులు ఇవ్వకుండా ముస్తకీమ్‌, మహ్మద్‌ కైఫ్‌లు హైదరాబాదు నుంచి తమ స్వగ్రామాలకు వచ్చారు. తనకు అద్దె డబ్బులు ఇవ్వాలని అన్వర్‌అలీ తరుచు ఫోన్‌ చేస్తూ ఒత్తిడి చేయడంతో అన్వర్‌అలీని ఎలాగైనా హత్య చేయాలని ముస్తకీమ్‌, మహ్మద్‌కైఫ్‌ లు భావించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఫుట్‌పాత్‌లు, ఆటోల్లో నిద్రిస్తున్న వారే టార్గెట్‌...

సోమవారం మధ్యాహ్నం అన్వర్‌అలీ డబ్బుల కోసం ఫోన్‌ చేయడంతో డబ్బులు ఇస్తామని చెప్పి అతడిని కోహీర్‌కు రమ్మన్నారు. దీంతో అతడు సోమవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో కోహీర్‌కు వచ్చాడు. వీరు ముగ్గురు కలిసి కోహీర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వెనుక భాగంలో మద్యం సేవించారు. అక్కడ మద్యం సేవించిన తర్వాత డబ్బుల విషయమై వీరి మధ్య గొడవ జరిగింది. తమ వెంట తెచ్చుకున్న కత్తితో అన్వర్‌అలీపై దాడి చేశారు. ఈ దాడిలో మొదట ముస్తకీమ్‌ చాతిపై కత్తి ఘాటు పడింది. దీంతో ముస్తకిం, మహమ్మద్‌ కైఫ్‌లు ప్రతిఘటించి అదే కత్తితో అన్వర్‌అలీపై దాడి చేశారు. దీంతో అన్వర్‌అలీ అక్కడికక్కడే మృతి చెందాడు. చనిపోయాడని వీరిద్దరూ నిర్ధారించుకొని కోహీర్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. బుధవారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న జహీరాబాద్‌ సీఐ రవి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా వీరు ముగ్గురు కలిసి దొంగతనాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అన్వర్‌అలీపైన నగరంలోని వివిధ పోలీస్‌ స్టేషన్‌లో 11 చోరీ కేసులు కూడా ఉన్నట్లు తెలిపారు. ముస్తకీమ్‌, మహ్మద్‌ కైఫ్‌లు కూడా పలు దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఆహా.. ఏం ఐడియా గురూ.. ఉల్లిపాయల బస్తాల మాటున నిషేధిత విత్తనాల రవాణా

Read More Crime News and Telugu News

Updated Date - Apr 24 , 2024 | 10:27 AM

Advertising
Advertising