ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Secunderabad: చంపేస్తానని బెదిరిస్తే హత్య చేశా..

ABN, Publish Date - Oct 24 , 2024 | 10:54 AM

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుడిని సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు(Secunderabad Railway Police) అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇందుకు సంభందించిన వివరాలను సికింద్రాబాద్‌ రైల్వే డీఎస్పీ జావెద్‌, సికింద్రాబాద్‌ రైల్వే ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌ తెలిపారు.

- పోలీసుల విచారణలో ఒప్పుకున్న నిందితుడు

- సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ హత్య కేసులో అరెస్టు

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుడిని సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు(Secunderabad Railway Police) అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. సికింద్రాబాద్‌ రైల్వే డీఎస్పీ జావెద్‌, సికింద్రాబాద్‌ రైల్వే ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌ల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో గత నెల 21న ప్లాట్‌ఫాం నెంబరు 10 వద్ద ఓ వ్యక్తి హత్యకు గురికాగా ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మెట్టపల్లి లక్ష్మిపతి విషయాన్ని గమనించి జీఆర్‌పీ పోలీసులకు తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: BJP: మూసీ సుందరీకరణ పేరుతో.. పేదల ఇళ్లను కూల్చితే ఊరుకోం..


విషయం తెలుసుకున్న సికింద్రాబాద్‌ రైల్వే ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌(Secunderabad Railway Inspector Sai Iswar Goud)తో పాటు కానిస్టేబుళ్ల బృందం ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. అనంతరం రైల్వే పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించిన ఆనవాళ్లు ఘటనా స్థలంలో దొరికిన వస్తువుల్ని రైల్వే పోలీసులు ల్యాబ్‌కు పంపించారు. ఈ క్రమంలో హత్యకు గురైన వ్యక్తి రైల్వే స్టేషన్‌ లోపలికి ఎక్కడ్నుంచి లోపలికి వచ్చాడు.. ఎవరితో మాట్లాడుతున్నాడన్న కోణంలో రైల్వే పోలీసులు సీసీ పుటేజీలను పరిశీలించారు.


నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలించాయి. ఎట్టకేలకు దర్యాప్తు ప్రారంభించిన రైల్వే పోలీసులు చివరికి హత్య చేసింది సికింద్రాబాద్‌ మెట్టుగూడ(Secunderabad Mettuguda) కేంద్రీయ రైల్వే ఆస్పత్రి వెనుక వైపు రైల్వే క్వార్టర్‌ ప్రాంతంలో ఉంటున్న సుభాష్‌ బహేశ్వర్‌ (39)ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. హత్యకు గురైన వ్యక్తి నిసాద్‌ రామ్‌ సనై బొల్లారంలో ఉంటాడని విచారణలో వెల్లడైంది.


హత్యకు గురైన వ్యక్తి తరచూ కొంత కాలంగా డబ్బులు ఇవ్వాలని వేధించడమే గాకుండా ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించేవాడని విచారణలో వెల్లడైంది. హత్య జరిగిన రోజు నిసాద్‌ రామ్‌కు నిందితుడు ఫోన్‌ చేసి సికింద్రాబాద్‌ ప్లాట్‌ ఫాం నెంబరు 10 లోకి మాట్లాడుతానని చెప్పి అక్కడికి రప్పించాడు. దుడ్డు కర్రతో కొట్టి హత్య చేశాడని రైల్వే పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు నిందితుడిని రిమాండుకు తరలించారు.


ఇదికూడా చదవండి: చెప్పినట్లుగానే దరణిని మారుస్తున్నాం: మంత్రి పొంగులేటి

ఇదికూడా చదవండి: తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలనూ తిరుమలలో అనుమతించాలి

ఇదికూడా చదవండి: KTR: రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు

ఇదికూడా చదవండి: Bandi Sanjay: భయపెట్టాలని చూస్తే భయపడతామా?

Read Latest Telangana News and National News

Updated Date - Oct 24 , 2024 | 10:54 AM