ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Social media: కొంప ముంచిన సోషల్‌మీడియా పోస్ట్‌..

ABN, Publish Date - Jul 14 , 2024 | 10:55 AM

సోషల్‌ మీడియా(Social media) పిచ్చి ఓ వ్యక్తిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసేలా చేసింది. నిబంధనల ప్రకారం ట్యాక్స్‌ కట్టకుండా పది మద్యం సీసాలను గోవా నుంచి తీసుకువచ్చి అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తిని ఎక్సైజ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

- మద్యం సీసా డ్యామేజ్‌ కాకుండా ప్యాకింగ్‌ ఎలా? అంటూ వీడియో

- అక్రమంగా గోవా నుంచి తెచ్చిన మద్యం కావడంతో అరెస్ట్‌

హైదరాబాద్: సోషల్‌ మీడియా(Social media) పిచ్చి ఓ వ్యక్తిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసేలా చేసింది. నిబంధనల ప్రకారం ట్యాక్స్‌ కట్టకుండా పది మద్యం సీసాలను గోవా నుంచి తీసుకువచ్చి అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తిని ఎక్సైజ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మద్యం బాటిళ్లను సీజ్‌ చేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు2 రిజెన్సీ ఆర్కెడ్‌(Jubilee Hills Road No. 2 Regency Arcade)లో ఉండే బొరిగోర్ల ఆనంద్‌ పౌల్‌ అలియాస్‌ కోటి యాదవ్‌(Koti Yadav) గోవా నుంచి పది మద్యం సీసాలను నగరానికి తీసుకువచ్చి అక్రమంగా నిల్వ చేశాడు. అయితే, రవాణా సమయంలో మద్యం సీసాలను ఎలా ప్యాకింగ్‌ చేయాలి.. అవి డ్యామేజ్‌ కాకుండా ఎక్కడికైనా ఎలా తీసుకెళ్లాలనే దానిపై రెండు నిమిషాల నిడివి గల వీడియో తీసి ఫేస్‌బుక్‌లో కొద్ది రోజుల క్రితం పోస్టు చేశాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: దిల్‌సుఖ్‌నగర్‌లో అర్ధరాత్రి ఆకస్మిక ధర్నా..


ఈ పోస్టును చూసిన డిస్ట్రిక్ట్‌ టాస్క్‌ఫోర్స్‌ హైదరాబాద్‌ బృందం డీపీఈఓ సీహెచ్‌ విజయ్‌, ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ వాసుదేవరావు సంయుక్తధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఎక్సైజ్‌ డ్యూటీ కట్టకుండా నిబంధనలకు విరుద్ధంగా 750 లీటర్ల చొప్పున 10 మద్యం సీసాలను తీసుకువచ్చినట్లు గుర్తించారు. మద్యం సీసాలను సీజ్‌ చేసి పౌల్‌ను అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్‌ పోలీసులకు అప్పగించారు.


ఇదికూడా చదవండి: హైదరాబాద్‏లో కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 14 , 2024 | 10:55 AM

Advertising
Advertising
<